మహేష్ ఈ ఏడాది `సరిలేరు నీకెవ్వరు` చిత్రంతో శుభారంభాన్ని అందించారు. సంక్రాంతికి బరిలో దిగిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ ఇచ్చిన సక్సెస్ ఆనందంలో వున్న మహేష్ రెట్టించిన ఉత్సాహంతో కొత్త చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారు. `సర్కారు వారి పాట` పేరుతో ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కించబోతున్నారు.
కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించనున్న ఈ చిత్రం భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాల నేపథ్యంలో ఓ ఘరానా మొసగాడి చుట్టూ తిరుగుతుందని చెబుతున్నారు. ఓ వైట్ కాలర్ నేరగాడికీ హీరో మహేష్‌కి మధ్య రసవత్తరంగా ఈ మూవీ సాగుతుందని ఇప్పటికే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ పాత్రలో ఎవరు నటిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ పాత్రలో స్లైలిష్ విలన్‌గా కన్నడ హీరో ఉపేంద్ర నటిస్తారని ప్రచారం జరిగింది కానీ తాజా సమాచారం ప్రకారం ఆ పాత్రలో అరవిందస్వామిని ఫైనల్ చేసినట్టు తెలిసింది. ఈ విషయాన్ని మేకర్స్ త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారట.