గోల్డ్‌ కాయిన్స్ కొంటే లాభమా? నష్టమా?

-

గోల్డ్‌ కాయిన్స్‌ కొనాలనుకుంటున్న వారికి ఈ కాయిన్స్‌ వారు లాభం పొందుతారో? లేదో ముందుగా తెలుసుకోవాలి. బంగారంపై పెట్టుబడి పెట్టడానికి చాలా మార్గాలు ఉన్నాయి. బంగారం ఆభరణాలు, గోల్డ్‌ ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు పెట్టవచ్చు. సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌ కొనవచ్చు. అదేవిధంగా గోల్డ్‌ కాయిన్స్‌ కొనవచ్చు. గోల్డ్‌ కాయిన్స్‌ కొనేవారు వాటిని కొని ఇంట్లో దాచిపెట్టుకోవడం వల్ల మీకు లాభమా?నష్టమా? ముందుగా తెలుసుకోండి. సాధరణంగా గిఫ్ట్‌గా ఇవ్వడానికి గోల్డ్‌ కాయిన్స్‌ కొంటుంటాం. వీటిని బంగారం విక్రయించే దుకాణాల్లో కొనవచ్చు. అలాగే బ్యాంకుల్లో కూడా కొనుగోలు చేయవచ్చు. బయట దుకాణాల కంటే బ్యాంకుల్లో వీటి ధర ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇ–కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌లైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో కూడా కొనవచ్చు. ఇవి గ్రాము నుంచి విక్రయిస్తారు. మార్కెట్‌లో బంగారం ధరలను బట్టి గోల్డ్‌ కాయిన్స్‌ను ధరలు నిర్ణయిస్తారు.


మీరు ఈ బంగారం నాణేలను కొనాలనుకుంటే బ్యాంకుల్లో లేదా ఏదైనా ప్రముఖ నగల దుకాణాల నుంచి కొనాలి.వాటిలో అయితే ప్యూరిటీ ఉంటుంది. మాములు చిన్న దుకాణాల్లో అయితే మీరు స్వచ్చమైన గోల్డ్‌ను కోల్పోతారు. గోల్డ్‌ కాయిన్స్‌ సులభంగా అమ్మవచ్చు. అందుకే గోల్డ్‌ కాయిన్స్‌ను కొనడానికి ఇష్టపడతారు. అయితే భవిష్యత్తులో ఎక్కువ రేటుకు అమ్మితే వచ్చిన లాభంపై క్యాపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌ చెల్లించాలి. డిజిటల్‌ రూపంలో పెట్టుబడి పెడితే మళ్లీ వాటిని గోల్డ్‌ కాయిన్‌గా మార్చాలంటే మేకింగ్‌ ఛార్టీలు చెల్లించాలి. ఈ చార్జీలు వివిధ సంస్థలను బట్టి మారుతాయి.
మీ అవసరాల కోసం ఈ గోల్డ్‌ కాయిన్స్‌ను తాకట్టు పెట్టాలంటే బ్యాంకుల్లో పెట్టడానికి వీలుండదు. కేవలం బ్యాంకుల్లో కొన్న కాయిన్లనే తాకట్టు పెట్టుకోవచ్చు. కేవలం పెట్టబడి కోసం గోల్డ్‌ కాయిన్స్‌ తాకట్టు పెట్టవచ్చు. కాయిన్స్‌ రూపంలో ఇంట్లో దాచిపెట్టుకున్న రిస్క్‌ ఎక్కువే. బ్యాంక్‌ లాకర్లలో దాచిపెట్టడం మంచిది. కాయిన్ల కాకుండా గోల్డ్‌ ఈటీఎఫ్‌లలో, డిజిటల్‌ రూపంలో భద్రపరుచుకోవడం సురక్షితం.

Read more RELATED
Recommended to you

Exit mobile version