రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్-డి సరిగ్గా ఉంటే సమస్యలు వుండవు…!

-

విటమిన్-డి సప్లిమెంట్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు చాల వున్నాయి. మనకు విటమిన్ డి చాలా ముఖ్యం. ఇవి ఎముకల బలానికి ముఖ్యం కాదు కానీ ఇమ్యూనిటీ సిస్టమ్ ని పెంపొందించడానికి విటమిన్-డి బాగా ఉపయోగపడుతుంది. విటమిన్-డి కనుక తక్కువగా ఉంటే ఇమ్యూనిటీ సిస్టమ్ బలహీనంగా ఉంటుంది. తాజాగా చేసిన అధ్యయనంలో రీసెర్చర్లు పలు విషయాలు చెప్పారు. మన శరీరం లో విటమిన్ డి సరిగ్గా ఉండడం వల్ల చనిపోయే ప్రమాదం కూడా తగ్గుతుంది అని అంటున్నారు.

విటమిన్ డి మనకి కావాల్సిన న్యూట్రియంట్స్ లో అవసరమైన న్యూట్రియంట్. దీని వల్ల ఎన్నో ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఇమ్మ్యూనిటి సిస్టమ్ ని మెరుగ్గా ఉంచడం కూడా దీని మీద ఆధారపడి ఉంటుంది. అయితే మనకి విటమిన్-డి ఎలా అందుతుంది అనే విషయాన్ని చూద్దాం.

ఎంత విటమిన్ డి ఉండాలి..?

ఫార్మకాలజీ & ఫార్మాకోథెరపీటిక్స్, చెప్పిన దాని ప్రకారం 25-హైడ్రాక్సీవిటామిన్ డి స్థాయి [25 (OH) D] పరీక్ష ద్వారా మనం తెలుసుకోవచ్చు. 25 (OH) D 20 ng / ml కంటే ఎక్కువగా ఉంటే సరిపోతుంది. 20 ng / ml కన్నా తక్కువ ఉంటే సరిపోదు, మరియు 12 ng / ml లోపు కనుక ఉంటే అది లోపంగా పరిగణించబడుతుంది.

విటమిన్ డి సూర్య కిరణాల ద్వారా మనం తీసుకోవచ్చు. అలానే పుట్టగొడుగులు ఆహారంలో తీసుకోవడం వల్ల విటమిన్-డి ని మనం పెంపొందించుకోవచ్చు. అలానే ఆవు పాలు, ఆరెంజ్ జ్యూస్, యోగర్ట్, టోఫు మొదలైన వాటిని ఆహారంగా తీసుకోవచ్చు. గుడ్డు సొనలో కూడా విటమిన్-డి ఉంటుంది. టున, సార్డినెస్ మొదలైన ఫ్యాటీ చేపల్లో కూడా విటమిన్-డి ఎక్కువగా ఉంటుంది.

ఇలా మీరు విటమిన్-డి సరిగ్గా ఉండేటట్టు చూసుకున్నారు అంటే ప్రమాదకరమైన వైరస్లు మీ దరి చేరకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. పైగా మీ రోగ నిరోధక శక్తి కూడా మరింత శక్తివంతంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండ మీ డైట్ లో ఆహార పదార్ధాలని తీసుకోండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version