దేశంలో ప్రజలు ప్రస్తుతం ఓ వైపు కరోనా మహమ్మారి మాత్రమే కాదు.. మరోవైపు మిడతలతోనూ బెంబేలెత్తిపోతున్నారు. కోట్ల కొద్దీ మిడతలు దండెత్తి వస్తుండడంతో జనాలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికే ఎన్నో లక్షల హెక్టార్ల పంటను మిడతలు తినేశాయి. ఇక ఈ మిడతలు తెలంగాణపై కూడా దండెత్తుతాయని అంటున్నారు. అయితే మిడతలు పంటలను తినడం మాత్రమే కాకుండా.. మనుషులకు కూడా హాని కలిగిస్తాయా ? వాటి వల్ల మనుషులకు ప్రమాదం ఉంటుందా ? దీనిపై నిపుణులు ఏమంటున్నారంటే…
దోమలు కుట్టినట్లు మిడతలు మనుషులను కుట్టవు. అవి కేవలం పంటలను మాత్రమే తింటాయి. ఇక అవి జంతువులను కూడా కుట్టవు. కాకపోతే అవి తమకు హాని కలుగుతుందని భావిస్తే.. చిన్నగా కాటు వేస్తాయి. దీంతో మనకు చీమ కుట్టినట్లు అనిపిస్తుంది. కానీ అది కూడా చాలా అరుదుగా జరుగుతుంది. ఇక మిడతలు మనుషులకు హాని కలిగించినట్లు ఇప్పటి వరకు ఎక్కడా దాఖలాలు లేవు. కనుక మిడతల వల్ల భయపడాల్సిన పనిలేదని నిపుణులు అంటున్నారు.
అయితే పెద్ద మొత్తంలో మిడతలు వస్తే మాత్రం ఎవరూ ఇండ్ల నుంచి బయటకు రాకపోవడమే ఉత్తమమని అంటున్నారు.