ఆ రీజన్ వల్లే ఈ హీరోకు అవకాశాలు తగ్గిపోయాయా..?

-

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొదట పలు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి.. ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి విజయాలను అందుకున్నాడు హీరో శ్రీకాంత్. దాదాపుగా రెండు దశాబ్దాల వరకు వరుస విజయాలను సొంతం చేసుకున్నారు. ఇక అంతే కాకుండా స్టార్ హీరోల సినిమాలలో కూడా నటించే అవకాశాలను సంపాదించుకున్నారు. అయితే ఆ తర్వాత శ్రీకాంత్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిన తర్వాత కెరియర్ మాత్రం చాలా ఒడిదురుకులను ఎదుర్కోవాల్సి వస్తోంది.

ప్రస్తుతం హీరో జగపతిబాబు లాగా శ్రీకాంత్ కూడా తన కెరియర్ మారిపోతుందని భావించినా.. శ్రీకాంత్ కి అనుకున్నంత స్థాయిలో ఆఫర్లు రాలేకపోవడం జరుగుతోంది. అఖండ సినిమాలో విలన్ గా నటించిన శ్రీకాంత్.. ఈ సినిమాలో మెయిన్ విలన్ గా నటించకపోవడమే అందుకు ముఖ్య కారణం అన్నట్టుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇదే ఈ హీరోకు మైనస్ గా మారింది అని సమాచారం. ఈ చిత్రంలో మెయిన్ హీరోగా నటించినా.. ఈ హీరో కెరియర్ మరొక లాగా ఉండేది అన్నట్లుగా ఆయన అభిమానులు కూడా భావిస్తున్నారు. అయితే అఖండ సినిమా విడుదలకు ముందు వరకు ఈ సినిమాలో మెయిన్ విలన్ గా శ్రీకాంత్ అనే ప్రచారం బాగా జరిగింది. కానీ ఈ చిత్రం రిలీజ్ అయిన తర్వాత మాత్రం శ్రీకాంత్ ఎందుకు ఓకే చెప్పారు అంటూ ఆయన అభిమానులు కూడా నిరుత్సాహపడ్డారు.

దీంతో తెలుగులో ఆశించిన స్థాయిలో అవకాశాన్ని దక్కించుకోలేకపోతున్నాడు. హీరో శ్రీకాంత్ తన కెరీర్ విషయంలో జాగ్రత్త వహించకుంటే ఇక అంతే అంటూ ఆయన అభిమానులు సైతం సినిమా కథల ఎంపిక విషయంలో జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న యువ హీరోల సినిమాలలో విలన్ గా శ్రీకాంత్ నటిస్తే బాగుంటుంది అని మరి కొంతమంది కూడా అభిప్రాయపడుతున్నట్టుగా తెలుస్తోంది. మరి శ్రీకాంత్ ఎటువైపుగా అడుగులు వేస్తారో తెలియాలి అంటే తన తదుపరిచిత్రం వరకు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version