ఇరాన్‌లో భారీ భూకంపం.. ఇప్పటికే ముగ్గురు మృతి..

-

మొన్నటికి మొన్న అఫ్ఘానిస్థాన్‌లో చోటు చేసుకున్న భూకంపంలో సుమారు 250 మందికి పైగా మృతి చెందిన ఘటన మరువకముందే మరో ఘటన చోటు చేసుకుంది. ఇరాన్‌లో భారీ భూకంపం సంభవించించింది. శనివారం తెల్లవారుజామున హర్మోజ్‌గంజ్‌ ప్రావిన్స్‌లోని ఓడరేవు పట్టణం బందర్‌ అబ్బాస్‌లో భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 6.0గా నమోదయింది. బందర్‌ అబ్బాస్‌కు 100 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది.

భూకంప ప్రభావంతో ముగ్గురు మరణించారని, 19 మంది గాయపడ్డారని ఇరాన్‌ అధికారిక న్యూస్‌ ఏజెన్సీ ఐఆర్‌ఎన్‌ఏ తెలిపింది. హర్మోజ్‌గంజ్‌ ప్రావిన్స్‌లో గతేడాది నవంబర్‌లో 6.4, 6.3 తీవ్రతతో వరుసగా రెండు భారీ భూకంపాలు వచ్చాయి. 1990లో వచ్చిన 7.4 తీవ్రతతో వచ్చిన భారీ భూకంపంతో సుమారు 40 వేల మంది మరణించారు. కాగా, గతవారం అఫ్గానిస్థాన్‌లో వచ్చిన భూకంపం సంభవించిన విషయం తెలిసింది. దీంతో సుమారు 1500 మంది ప్రాణాలు కోల్పోయారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version