c నుండి బయటకి వచ్చేయొచ్చు. డార్క్ సర్కిల్స్ సమస్యని పరిష్కరించుకోవడానికి బాదం నూనె బాగా ఉపయోగపడుతుంది. డార్క్ సర్కిల్స్ తో బాధపడే వాళ్ళు రాత్రి నిద్రపోయే ముందు కొన్ని చుక్కల బాదం నూనెని కళ్ళ కింద రాసుకోండి. ఆ తరవాత నెమ్మదిగా మసాజ్ చేయండి ఉదయాన్నే శుభ్రం చేసుకోండి.
ఇక డార్క్ సర్కిల్స్ బాధ ఉండదు. కీర దోస కూడా డార్క్ సర్కిల్స్ ని తొలగించగలదు. కళ్ళ కింద కీరా ముక్కలు ని పెట్టుకుంటే డార్క్ సర్కిల్స్ నుండి త్వరగా బయటపడొచ్చు. 10 నుండి 15 నిమిషాల పాటు కీరా ముక్క ని కళ్ళ కింద పెట్టుకుంటే చక్కటి ఫలితం కనబడుతుంది. డార్క్ సర్కిల్స్ ని పోగొట్టడానికి పసుపు కూడా బాగా ఉపయోగపడుతుంది. పసుపు పేస్టులాగ చేసుకుని కళ్ళ కింద భాగంలో రాసుకుంటే డార్క్ సర్కిల్స్ నుండి త్వరగా బయటపడవచ్చు.
రోజ్ వాటర్ ని కాటన్ ప్యాడ్ లో ముంచి ముఖం మీద 10 నుండి 15 నిమిషాలు ఉంచితే కూడా డార్క్ సర్కిల్స్ తొలగిపోతాయి. టమాటా రసాన్ని రాసిన కూడా డార్క్ సర్కిల్స్ పోతాయి అలోవెరా జెల్ కూడా ఇందుకు బాగా ఉపయోగపడుతుంది పుదీనా ఆకులు కూడా మీరు రాసుకోవచ్చు. పుదీనా ఆకుల్ని పేస్ట్ కింద చేసి డార్క్ సర్కిల్స్ ఉన్నచోట రాసినట్లయితే త్వరగా డార్క్ సర్కిల్స్ పోతాయి.