ఇంట్లో బల్లులు ఎక్కువ ఉన్నాయా..? ఈ సింపుల్ టిప్స్ తో చెక్..!

-

చాలామంది బల్లుల వల్ల విసిగిపోతూ ఉంటారు మీ ఇంట్లో కూడా బల్లులు ఎక్కువగా వస్తున్నాయి.. బల్లుల కారణంగా మీరు ఇబ్బంది పడుతున్నారా అయితే కచ్చితంగా మీరు ఈ చిట్కాలని పాటించండి. దీంతో బల్లులు మీ ఇంట్లో నుండి పారిపోతాయి. పైగా చాలామంది భయపడుతూ ఉంటారు ఇలా చేస్తే ఇక నుండి భయపడాల్సిన పని కూడా ఉండదు ఇంటి గోడల మీద ఉండే చిన్న చిన్న పురుగుల కారణంగా బల్లులు మన ఇంట్లోకి వస్తాయి. వాటిని పట్టి తినడానికి గోడ మీద ఎదురు చూస్తూ ఉంటాయి ఇకనుండి మీకు ఆ బాధ ఉండదు.

మీరు మొదట ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోండి యాంటీ బ్యాక్టీరియా సొల్యూషన్ తో ఇంటి లోపల గోడల్ని ఫ్లోర్ ని శుభ్రం చేయండి. కిటికీలను కూడా శుభ్రం చేసుకోండి.
బల్బులను ఆపేస్తే ఇంట్లోకి బల్లులు రావు. సో అవసరం లేనప్పుడు బల్బులని ఆపేయండి. బల్లులు తినేందుకు ఆహారం దొరకకపోతే వాటి అంతట అవే వెళ్ళిపోతాయి ఇంట్లో క్రిములు కీటకాలు లేకుండా చూసుకోండి.
ఘాటైన ఉల్లి వాసన బల్లులకి పడదు ఉల్లి రసాన్ని గోడల మీద స్ప్రే చేస్తే ఈ సమస్య ఉండదు ఉల్లిగడ్డలని ముక్కలు కింద కోసి కిటికీలలో మూలల్లో ఉంచితే కూడా బల్లులు రావు.
బిర్యానీ ఆకులు పొగ కింద వేసి బల్లులని దూరం చేసేయొచ్చు ఆ వాసన బల్లులకి కిట్టదు.
ఇంటి గోడల మీద క్రాక్స్ లేకుండా చూసుకోండి ఫర్నిచర్ ని గోడలకు ఆనించి ఉంచకూడదు. బల్లులు కనబడితే చల్లటి నీళ్లు పోయండి వెంటనే కింద పడిపోతాయి అప్పుడు మీరు బయటకి తీసుకువెళ్లి పాడేయండి.
కర్పూరం వాసనికి కూడా బల్లులు వెళ్లిపోతాయి ఇలా ఈ చిన్న చిన్న చిట్కాలను ట్రై చేసి బల్లులు లేకుండా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version