ఇంటిని శుభ్రం చేసుకోవడం అంత ఈజీ కాదు మనకి తెలియకుండా అక్కడక్కడ మురికి, దుమ్ము, ధూళి వంటివి ఉండిపోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి గోడలు మీద నూనె మరకలు కూడా అవుతూ ఉంటాయి. నూనె మరకలు అయినట్లయితే ఈ విధంగా క్లీన్ చేసుకోండి ఇలా కనుక మీరు మీ గోడని క్లీన్ చేసుకుంటే సులభంగా నూనె మారకాలని వదిలించవచ్చు. గోడ తెల్లగా వచ్చేస్తుంది. నూనె మరకలు పోతాయి. గోడలమీద నూనె మరికల్ని ఎలా తొలగించుకోవాలని విషయానికి వచ్చేస్తే.. గోడల మీద నూనె మరకలు తొలగించడానికి బేకింగ్ సోడా బాగా ఉపయోగపడుతుంది.
బేకింగ్ సోడా ని నీటిలో కలిపి పేస్ట్ కింద చేసుకుని మరకలు ఉన్న ప్రదేశంలో అప్లై చేయండి 15 నుండి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత మీరు శుభ్రమైన క్లాత్ తీసుకుని తుడిచేయండి. ఇది పూర్తిగా ఆరిన తర్వాత నూనె మరక కొంచెం కూడా ఉండదు ఈజీగా క్లీన్ అయిపోతుంది. లిక్విడ్ డిష్ వాషర్ ని కూడా మీరు ఉపయోగించవచ్చు.
నూనె మరికల్ని తొలగించడానికి ఇది కూడా బెస్ట్ చిట్క. లిక్విడ్ డిష్ వాష్ ని మరక మీద వెయ్యండి ఆ తర్వాత ఒక క్లాత్ తీసుకుని రుద్దండి మరక మొత్తం పోతుంది. నూనె మరకలు తొలగించడానికి హెయిర్ డ్రయర్ కానీ ఐరన్ బాక్స్ ని కానీ మీరు గోడ మీద కాగితం పెట్టి దానిమీద ఐరన్ బాక్స్ కానీ హెయిర్ డ్రయర్ని కానీ పెట్టండి ఇలా చేయడం వలన మరక పోతుంది. వెనిగర్ తో కూడా మీరు క్లీన్ చేయొచ్చు. వెనిగర్ కూడా బాగా ఉపయోగపడుతుంది ఇలా ఈ చిన్న చిన్న చిట్కాలతో గోడల మీద నూనె మరకలు దూరం చేసుకోవచ్చు.