టాలీవుడ్ లో ఈ హీరోయిన్లకు బ్యాడ్ టైం నడుస్తోందా..?

-

ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా హీరోయిన్గా కెరియర్ కంటిన్యూ చేయాలి అంటే గ్లామర్, పెర్ఫార్మెన్స్ తో పాటు అదృష్టం కూడా ఉండాలి. ముఖ్యంగా సూపర్ హిట్స్ అందుకొని స్టార్ డం వస్తే గోల్డెన్ లెగ్ అని.. ప్లాప్స్ పడితే ఐరన్ లెగ్గానే స్టాంపు వేసేస్తున్న నేపథ్యంలో చాలామంది హీరోయిన్లు తమ టాలెంట్ ను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే త్రిష, అనుష్క, కాజల్, తమన్నా లాంటి కొంతమంది కథానాయకులు మాత్రమే దశాబ్దానికి పైగా తమ కెరియర్ ను కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. ఆ తర్వాత వచ్చిన హీరోయిన్ల కెరియర్ హిట్స్ మీదే ఆధారపడి ఉంది. మొన్నటి వరకు ఫామ్ లో ఉండి ఉన్నట్టుండి ప్లాప్ అవడంతో అర్జెంటుగా హిట్టు పడాలి.. లేకపోతే ట్రాక్ లోకి రావడం కష్టం అంటూ ఎదురు చూస్తున్న హీరోయిన్స్ గురించి ఇప్పుడు మనం చూద్దాం.

పూజా హెగ్డే:

ఈ ఏడాది ఈమె హీరోయిన్గా నటించిన రాధే శ్యామ్, ఆచార్య , బీస్ట్ ఇలా మూడు సినిమాలు కూడా వరుసగా డిజాస్టర్ అయ్యాయి. దీంతో ఐరన్ లెగ్ స్టాంపు కూడా ఈమెపై పడిపోయింది.. ఎలాగైనా సరే ఒక హిట్టు కొట్టాలి లేకపోతే ఇక ఈమె కెరియర్ డౌన్ అయినట్టే అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈమె చేతిలో మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ఒక్క సినిమా మాత్రమే ఉండడం గమనార్హం.

కృతి శెట్టి:

ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయిన కృతి శెట్టి ఆ తర్వాత బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ సినిమాలతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత వచ్చిన దివారియర్ , మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలు వరుసగా హ్యాట్రిక్ ఫ్లాప్ అందుకున్నాయి. దీంతో ఈమె పై కూడా ఐరన్ లెగ్గానే స్టాంపు పడిపోయింది . ప్రస్తుతం నాగ చైతన్యతో కస్టడీ సినిమా చేస్తోంది. మరి ఈ సినిమా విజయం సాధిస్తే తప్ప ఆమెకు అవకాశాలు రావని చెప్పాలి.

కీర్తి సురేష్:

మహానటి సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న ఈమె సర్కారు వారి పాట సినిమాతో హిట్ అయితే సొంతం చేసుకుంది కానీ హీరోయిన్ రేంజ్ లో మళ్ళీ అవకాశాలు రాలేదు. ఇటీవల ఈమె భోళా శంకర్ సినిమాలో చిరంజీవికి చెల్లిగా నటిస్తోంది. మరొకవైపు నాచురల్ స్టార్ నాని దసరా సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలు కీర్తి కెరీర్ ను డిసైడ్ చేస్తాయని చెప్పడంలో సందేహం లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version