ఈ లక్షణాలు ఉన్నాయా..? అయితే లివర్ డ్యామేజ్ అయినట్టే..!

-

ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. నిజానికి అనారోగ్య సమస్యలేమి లేకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైన పద్ధతుల్ని ఫాలో అవుతూ ఉండాలి. మీ ఆరోగ్యం పై మీరు దృష్టి పెట్టి జాగ్రత్తగా ఉంటున్నట్లయితే ఏ బాధ ఉండదు అయితే చాలా మంది ఎదుర్కొనే సమస్యలలో లివర్ సమస్య కూడా ఒకటి.

లివర్ సమస్యలతో చాలామంది సతమతమవుతున్నారు. అయితే లివర్ సమస్య కనుక ఉన్నట్లయితే ఈ లక్షణాలు మీలో కనపడుతూ ఉంటాయి. మరి లివర్ సమస్యలకి ఎటువంటి లక్షణాలు ఉంటాయి..?, ఎటువంటి ఇబ్బందుల్ని లివర్ సమస్యలు ఉన్నవాళ్లు ఎదుర్కొంటారు అనేది చూద్దాం.

ఎక్కువగా దాహం వేయడం:

ఎక్కువగా దాహం వేయడం. మంచినీరు తాగినా సరే దాహం తీరక పోయినట్లు అనిపించడం లివర్ సమస్యలకి సంకేతం.

మూత్రం రంగు మారడం:

మూత్రం రంగులో ముదురు రంగులో ఉంటే కూడా అది లివర్ సమస్యకి కారణం అవ్వచ్చు అలానే మలం లేత రంగులో ఉంటుంది.

కాళ్లల్లో వాపులు:

ఆకస్మాత్తుగా కాళ్లు చేతులు వాపులు రావడం కూడా లివర్ సమస్యలకి సంకేతం.

చర్మంపై దురదలు:

కాలేయం సరిగ్గా పని చేయకపోతే చర్మంపై దురదలు వస్తూ ఉంటాయి.

కడుపునొప్పి:

కాలేయం చెడిపోయినట్లయితే కడుపు నొప్పి కూడా వస్తుంది. పొట్ట వాపు ఎక్కువగా ఉంటుంది.

కళ్ళు రంగు మారడం:

కాలేయం కి సంబంధించిన ఏమైనా సమస్యలు ఉంటే పసుపు రంగులోకి కళ్ళు మారిపోతాయి. ఈ లక్షణాలు కనుక ఉంటే జాగ్రత్తగా ఉండండి. సీరియస్ గా ఉంటున్నట్లు అనిపిస్తే డాక్టర్ని కన్సల్ట్ చేయండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version