ఏపీలో ఎప్పుడూ కూడా రాజకీయాలు చాలా చిత్ర విచిత్రంగా ఉంటాయి. ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం ఎవరి తరం కాదు. ఇక తెలంగాణలో కంటే కూడా ఏపీలో కక్ష పూరిత రాజకీయాలు చాలా ఎక్కువనే చెప్పాలి. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో వైసీపీ పడ్డ ఇబ్బందులు ఆ తర్వాత ఇప్పుడ చంద్రబాబు పడుతున్న ఇబ్బందులను చూస్తేనే అది అర్థమయిపోతుంది. అయితే ఇప్పుడు తన అధికారాన్ని ఒకే వ్యక్తిపై పదే పదే ఉపయోగిస్తే అది కాస్త రివర్స్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. ఇలాంటి వ్యవహారమే ఇప్పుడు సీఎం జగన్ చేస్తున్నారు.
ఇక ఏపీలో ఇప్పుడు నారా లోకేష్ బాగానే యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నారు. అయితే ఆయన వ్యవహారంలో సీఎం జగన్ చేస్తున్న పనులు కాస్తా చర్చనీయాంశంగా అవుతున్నాయి. అయితే గతంలో చంద్రబాబు కూడా ఇదే విధంగా ఆయన సీఎంగా ఉన్నప్పుడు జగన్ పర్యటనలు అడ్డుకుని పదే పదే ఆయన్ను అరెస్టులు చేయించడంతో ఆయన కాస్తా ప్రజల్లో ఆదరణ పెంచేసుకుని ప్రజల గుండెలలో హీరోగా మారిపోయారు.
ఇలా అరెస్టు అయిన వారు తప్పకుండా ఇలాగే హీరోలుగా నిలుస్తారు. ఇక ఇదే తీరు చంద్రబాబుకు అధికారాన్ని దూరం చేసింది. ఇక ఇప్పుడు లోకేష్ విషయంలో కూడా జగన్ ఇలాగే చేస్తున్నారు. లోకేశ్ పర్యటనలను నిత్యం అడ్డుకోవడం లేదంటే ఆయన్ను అరెస్టులు చేయించడం లాంటివి చేస్తున్నారు. అయితే ఎమ్మెల్యేగా కూడా లేని లోకేష్‌ను చూసి వైసీపీ ఎందుకు ఇంత భయమేస్తుందో ఎవరికీ అర్థం కావట్లేదు. ఇక ఇలాంటి పనులు ఇప్పుడు లోకేష్‌ను ప్రజల్లో హీరోను చేస్తున్నాయి. ఇలాగే సాగితే ఆయన బలమైన లీడర్‌గా ఎదిగే ప్రమాదం కూడా ఉంది.