వేడిగా ఉందని రిఫ్రిజిరేటర్ లో ఉంచిన నీళ్ళు తాగుతున్నారా? ఐతే ఈ ముప్పు తప్పదు..

-

వేసవిలో వేడిగా ఉంటుంది కాబట్టి చల్లని నీళ్ళు తాగాలన్న కోరిక కలుగుతుంది. చల్లని నీళ్ళు తాగితే దాహం తీరుతున్నట్టుగా అనిపిస్తుంది. బయటకి వెళ్ళి వచ్చినపుడు ఈ కోరిక మరీ ఎక్కువగా ఉంటుంది. అప్పుడు సరాసరి ఫ్రిజ్ లోంచి బాటిల్ తీసి గడగడా నీళ్ళు తాగేస్తారు. దాహం తీరడం వరకూ బానే ఉంటుంది గానీ, ఇలా ఫ్రిజ్ లో కూల్ అయిన నీళ్ళు నీళ్ళు తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. దీనివల్ల అనేక నష్టాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుని ఫ్రిజ్ లో నీళ్ళు ఎందుకు తాగకూడదో చూద్దాం.

 

రిఫ్రిజిరేటర్ లో ఉంచిన నీటిని తాగడం వల్ల పేగులు కుచించుకుపోతాయి. తరచుగా తాగుతూ అలవాటుగా చేసుకుంటే పేగులు కుచించుకుపోయి జీర్ణాశయ సమస్యలకు దారి తీస్తుంది. ఆహారం జీర్ణం కాకపోవడం వల్ల మలబద్దకం ఏర్పడుతుంది. మీకు మలబద్దకం ఉన్నట్లయితే రిఫ్రిజిరేటర్లోని నీళ్ళు ఎక్కువగా తాగుతున్నారేమో ఒకసారి చెక్ చేసుకోండి. మలబద్దకం అనేక ఆరోగ్య సమస్యలకి మూలం. శరీర కణాలు కుచించుకుపోవడం వల్ల జీవక్రియ దెబ్బతింటుంది. హృదయ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశమూ ఎక్కువే.

ఫ్రిజ్ లో ఉంచిన నీళ్ళు తాగడం వల్ల వచ్చే మరో సమస్య, గొంతునొప్పి. దీనివల్ల టాన్సిల్స్ ఏర్పడే అవకాశమూ ఎక్కువే. అలాగే శరీరం తొందరగా అలసటకు గురవుతుంది. జీవక్రియపై ప్రభావం పడడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు సరిగ్గా అందవు. అపుడు శరీరంపై పోషకాల లోపం ఏర్పడి ఇతర ఇబ్బందులు కలుగుతాయి. అందుకే వేసవిలో రిఫ్రిజిరేటర్లోని నీళ్ళు దాహం తీర్చినా ఆరోగ్యానికి మంచివి కావు. కాబట్టి, వాటికి అలవాటు పడకుండా ఉండడమే ఉత్తమం.

Read more RELATED
Recommended to you

Exit mobile version