ఒత్తిడిగా ఉందని మద్యం తాగేస్తున్నారా..? ఇంకా డేంజర్‌..

-

ఈరోజుల్లో పని ఒత్తడి వల్ల చాలామంది.. సిగిరెట్‌, మద్యం తాగుతూ కాస్త రిలాక్స్‌ అవుతుంటారు. ఒత్తిడికి కారణం ఏదైనా కానీ.. దానికి పరిష్కారం మాత్రం ఆల్కాహాల్‌ అన్నట్లు చాలామంది మద్యంప్రియులు అనుకుంటారు. మద్యం తాగడం మాములాగానే డేంజర్‌ అంటే.. ఒత్తిడిగా ఉన్నప్పుడు తాగడం ఇంకా డేంజర్‌ అంటున్నారు నిపుణులు. అవును..ఒత్తిడిగా ఉన్నప్పుడు మద్య తాగకూడదట. ఎందుకంటే.. ఒత్తిడిలో మద్యం తాగితే కొన్ని విపరీత లక్షణాలు కనిపిస్తాయి. అవి ఎలా ఉంటాయంటే…

మానసిక కల్లోలం
హఠాత్తుగా కోపం
ఫోకస్ చేయడంలో ఇబ్బంది
బ్లాక్అవుట్
పెరిగిన ఒత్తిడి , ఆందోళన
పానిక్ అటాక్
నిద్రలేమి
లైంగిక కార్యకలాపాలపై ఆసక్తి కోల్పోవడం
ఆకలి లేకపోవడం

ఇలాంటివన్నీ.. ఒత్తిడిగా ఉన్నప్పుడు మద్యం తాగడం వల్ల ఎదురవుతాయట. ఆల్కహాల్ వల్ల మానసిక సమస్యలు కూడా వస్తాయి. ఆల్కహాల్ వల్ల వచ్చే ఏ మానసిక సమస్యకు చికిత్స లేదు. అందుకే వాటి బారిన పడకుండా ఉండడమే ఉత్తమం. ఆల్కహాల్ వల్ల వచ్చే మానసిక రుగ్మత, స్లీపింగ్ డిజార్డర్, డిప్రెసివ్ డిజార్డర్, యాంగ్జయిటీ… ఇవన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఒత్తిడిని ఇలా తగ్గించుకోండి..

ఒత్తిడి ఎక్కువగా అనిపిస్తే..వైన్‌ షాప్‌కు పోకుండా.. వ్యాయామం మీద దృష్టిపెట్టండి. జిమ్‌కి వెళ్లడం లేదా ఒక కిలోమీటరు నడవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అలాగే కొత్త ప్రదేశాలకు వెళ్లడం కూడా చాలా మేలు చేస్తుంది.

ధ్యానం, యోగ, ప్రాణాయామం వంటి శ్వాస ఆధారిత వ్యాయామాలు చేయడం కూడా చాలా మంచిది. ఇవి మనస్సును చాలా ప్రశాంతంగా ఉంచుతాయి. మానసిక ఆందోళనను తగ్గిస్తాయి.

మద్యం తాగడం మరీ అంత ప్రమాదకరం కాదు. ఒక అలవాటు వ్యసనంగా మారనంత వరకూ అది మంచిదే.. ఎప్పుడైతే అది వ్యసనం అవుతుందో.. అప్పుడా అలవాటు మనల్ని దహించేస్తుంది. ఒత్తిడి అనేది ఈరోజుల్లో చదువుకునే వారి నుంచి జాబ్‌ చేసే వారి వరకూ అందరికి ఉంటుంది. వీటిని తగ్గించుకోవడానికి వీలైనంత వరకూ ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. వీకేండ్స్‌లో అలా బయటకు వెళ్లండి. ఎప్పుడూ ఒకే ప్లేస్‌లో అలానే ఉండిపోతే.. ఒక స్టేజ్‌కి వచ్చే సరికి మీ మీద మీకే చిరాకు వస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version