గణేశ్ ఉత్సవాల్లో అలజడికి ఆ మంత్రులే కారణం : భగవంత్‌ రావు

-

ముఖ్యమంత్రి కేసీఆర్​పై తాను ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని భాగ్యనగర్ గణేశ్​ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంత్ రావు స్పష్టం చేశారు. ఉత్సవ సమితి వేడుకలకు మాత్రమే అసోం సీఎంను స్వాగతించామని పేర్కొన్న ఆయన చార్మినార్ వద్ద ఏర్పాటు చేసిన స్వాగత వేదికపైకి ఆయనని రానీయకుండా పోలీసులు అడ్డుకున్నారని మండి పడ్డారు. ఒక ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించ లేకపోయిందని ఆయన విమర్శించారు. రాజకీయాలతో ఉత్సవ సమితికి సంబంధం లేదని స్పష్టం చేశారు.

గణేశ్​ నిమజ్జనం రోజు ఏర్పాటు చేసిన స్వాగత వేదికలు ఉత్సవ సమితి ఏర్పాటు చేసిందని తమ వేదిక పైకి వచ్చిన స్థానిక తెరాస నాయకుడు తమ కార్యక్రమాన్ని వివాదం చేశారని పేర్కొన్నారు. తాను ఎలాంటి విభేదాలు సృష్టించే మాటలు మాట్లాడలేదని వివరణ ఇచ్చిన ఆయన మంత్రి కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్​లు ఈ అలజడికి కారకులుగా అనుమానిస్తున్నామని అభిప్రాయ పడ్డారు.

గణేశ్ నిమజ్జన కార్యక్రమాలు విజయవంతంగా ముగిసిశాయని అని తెలిపారు. నిమజ్జన కార్యక్రమాల్లో ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీస్ సిబ్బందికి, జీహెచ్ఎంసీ సంబంధిత అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version