వేసవికాలంలో చాలా మంది రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు వేసవికాలంలో ఎండలు విపరీతంగా ఉంటాయి. దాంతో ప్రతి ఒక్కరూ చల్లటి నీళ్లు తీసుకుంటూ ఉంటారు. వేసవి ఎండని తట్టుకోలేక ఫ్రిజ్లో పెట్టిన నీళ్లు, డ్రింక్స్ మొదలైన వాటిని తీసుకుంటూ ఉంటారు. చాలా మనది రోజంతా కూడా కూలింగ్ వాటర్ ని ఎక్కువసార్లు తీసుకుంటూ ఉంటారు చాలామందికి తెలియని విషయం ఏంటంటే చల్లటి నీళ్లు తీసుకోవడం వలన రకరకాల సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి చల్లటి నీళ్ల కి దూరంగా ఉండటమే మంచిది.
ఇక మరి చల్లటి నీళ్లు తీసుకుంటే ఎలాంటి నష్టాలు కలుగుతాయి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. చల్లటి నీళ్ళని తీసుకోవడం వలన గుండె వేగం బాగా పెరిగిపోతుంది చల్లటి నీళ్లు తీసుకుంటే హార్ట్ బీట్ విపరీతంగా పెరిగిపోయి నెర్వస్ సిస్టం ని డామేజ్ చేస్తుంది కాబట్టి చల్లటి నీళ్ళకి దూరంగా ఉండటమే మంచిది. అంతే కాకుండా చల్లటి నీళ్లను తీసుకోవడం వలన మరో సమస్య కూడా రావచ్చు అదే ఊబకాయం. ఊబకాయం సమస్యతో చల్లటి నీళ్లు తీసుకునే వాళ్ళల్లో కలగొచ్చు. సరైన జీవన విధానం లేకపోవడం ఆహారం వలన ఊబకాయం వస్తుంది.
చల్లటి నీళ్లని ఆహారం తీసుకున్న తర్వాత వెంటనే తీసుకుంటే కూడా ఊబకాయం సమస్య విపరీతంగా పెరుగుతుంది కాబట్టి చల్లటి నీళ్లను తీసుకోకపోవడం మంచిదే. పైగా చల్లటి నీళ్లను తీసుకోవడం వలన అజీర్తి సమస్యలు కూడా వస్తాయి గొంతులో ఇబ్బందులు కూడా చల్లటి నీళ్ల వల్ల కలుగుతాయి. రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కూడా చల్లటి నీళ్ల వల్ల కలిగే ఛాన్స్ ఉంది తలనొప్పి సైనస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చల్లటి నీళ్లకి దూరంగా ఉండటమే మంచిది. వేసవి కదా అని వేడిని తట్టుకోలేక చల్లటి నీళ్ళని తీసుకుంటున్నట్లయితే ఈ సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.