పానీపూరి అంటే ఇష్టపడని వాళ్ళు ఉన్నారా? బహుశా ఉండరేమో..దాని రుచి అలాంటిది మరి..ఎక్కడో పుట్టిన పానీపూరి ఇప్పుడు ప్రపంచమంతా ఫెమస్ అయ్యింది.. అయితే చుట్టూ మంచిగా ఉన్న ప్రాంతాల్లో తింటే ఒకే కానీ ఎక్కడ పడితే అక్కడ తింటే మాత్రం ప్రాణాలకే ముప్పు అంటున్నారు అధికారులు..అసలే ఎక్కడ చూసిన వర్షాలు కావడంతో రోగాలు ప్రబలే ఛాన్స్ ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు..పానీపూరి వినియోగంపై తెలంగాణ అధికారుల సీరియస్ అయ్యారు.
భారీ వర్షాల నేపథ్యంలో తోపుడు బండ్లపై విక్రయించే పానీ పూరీ తింటే రోగాల బారినపడే ముప్పు ఉందని హెచ్చరించారు. పానీ పూరీ బండ్ల దగ్గర నుంచే టైఫాయిడ్ కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. టైపాయిడ్ పానీపూరీ డిసీజ్‌గా మారిందన్నారు. పానీ పూరీ తోపుడు బండ్ల వారు కూడా ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు సూచించారు. మరోవైపు వర్షాకాలంలో సీజనల్ వ్యాధులతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు డీహెచ్. వరుసగా మూడు నాలుగు రోజులు జ్వరం వస్తే డాక్టర్‌కు చూపించుకోవాలన్నారు.