ఏపీ సీఎం జగన్ ను ప్రశంసించిన కేంద్రమంత్రి తోమర్

-

ఇవాళ కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌తోమర్ తో ముఖ్యమంత్రి వైయస్‌.జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ లో పాల్గొన్నారు. కేంద్ర బృందం రాష్ట్ర పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి సూచనల మేరకు ఫసల్‌ బీమా యోజన మార్గదర్శకాల్లో మార్పులు చేసింది కేంద్ర వ్యవసాయ శాఖ. ప్రకటించిన పంటల్లో రైతులందరికీ ఫసల్‌ బీమా వర్తించేలా మార్పులు చేస్తూ కేంద్రం నిర్నయం తీసుకుంది. ఇ–క్రాప్‌ వివరాలతో బీమా పథకానికి అనుసంధానించే విధానం చేపట్టింంది.వ్యవసాయ పద్ధతుల ఆధారంగా డేటా ఎంట్రీ చేసే విషయంలో సౌలభ్యతను తీసుకొచ్చింది కేంద్ర వ్యవసాయశాఖ.

యూనివర్సల్‌ కవరేజీ అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా ఏపీ గా నిలిచింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్‌కు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ ప్రశంసల జల్లు కురిపించారు. ఇ–క్రాపింగ్‌ విధానం అత్యంత వినూత్నమైదని.. ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌. ప్రకృతి సేద్యం, అగ్రి ఇన్‌ఫ్రా ఫండ్‌ విషయలోనూ ఏపీ స్ఫూర్తిదాయకమని.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత పంటల బీమా పథకంలోకి ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన అని ప్రకటించారు తోమర్‌.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version