భారత క్రీడాకారలు అప్పుడప్పుడు తమలోని ఇతర టాలంట్‌లను సైతం బయట పెట్టి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంటారు. ఈ క్రమంలోనే పారిస్ ఒలింపిక్స్‌లో షూటింగ్ విభాగంలో 3 మెడల్స్ సాధించిన భారత షూటర్ మను భాకర్.. తాజాగా ఓ ఫ్యాషన్ షోలో తళుక్కుమని మెరిసి అందరినీ షాక్‌కు గురిచేసింది. ఈనెల 11న జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్‌లో మోడ్రన్ డ్రెస్‌లో మను ర్యాంప్ వ్యాక్ చేసింది.
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన లాక్మే ఈవెంట్‌లో అందాల భామలతో మనుబాకర్ పోటీ పడింది.ప్రొఫెషనల్స్‌తో పోటీపడిన ఒలింపిక్ మెడలిస్ట్ తన అందానికి తగ్గ డ్రెస్ వేసుకుని అదరగొట్టింది. ఈ సందర్బంగా మను మాట్లాడుతూ.. షూటింగ్ ప్రాక్టీస్ తర్వాత దొరికిన కొద్ది టైంలో ఇలాంటి షోలో పాల్గొనడం ఉత్సహంగా ఉన్నప్పటికీ.. అందరి ముందు ర్యాంప్ వాక్‌లో నడవడం కాస్త ఇబ్బందిగా అనిపించిందని చెప్పింది. మను లాక్మే ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్ వాక్‌కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.