లిక్క‌ర్ క్వీన్స్‌.. మ‌ద్యం షాపుల కోసం ఎగ‌బ‌డ్డారుగా

-

మేము ట్రెండ్‌ను ఫాలో అవ్వం…ట్రెండ్‌ను సెట్ చేస్తాం అంటున్నారు ఏపీ లిక్క‌ర్ క్వీన్‌లు.సాధార‌ణంగా మ‌ద్యం వ్యాపారంలో పురుషుల‌దే హ‌వా.అయితే మారుతున్న ట్రెండ్‌లో మ‌హిళ‌లు సైతం మ‌ద్యానికి అల‌వాటు ప‌డుతున్నారు. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి ఏకంగా వ్యాపారంలోకి దిగేశారు.మేం త‌క్కువ తిన్నామా అంటూ మ‌గ‌వాళ్ళ‌కు పోటీగా ల‌క్కీ డ్రాలో మ‌ద్యం షాపుల‌ను ద‌క్కించుకున్నారు. ఏపీలో ప్ర‌స్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియ విజ‌య‌వంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 3395 మద్యం దుకాణాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నోటిఫై చేసి దరఖాస్తులను ఆహ్వానించింది.ఈ మేరకు ఈనెల 11 వరకు ఇచ్చిన గ‌డువులో రాష్ట్ర వ్యాప్తంగా 89, 882 దరఖాస్తు చేస్తున్నారు. దీంతో నాన్ రిఫండబుల్ రుసుము రూపంలో ప్ర‌భుత్వానికి 1797 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా లాటరీ ప్రక్రియ నిర్వ‌మించగా లాటరీలో చాలామంది షాపులు దక్కించుకున్నారు. అందులో మహిళలు ఉండడం మ‌రో విశేషం.

మొత్తం 3396 మద్యం షాపులకు గాను 10 శాతం షాపులను మహిళలు సొంతం చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 345 షాపులు మహిళల పేరిట వచ్చాయి. మహిళలకు దక్కిన షాపులను జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా విశాఖలో 31 మద్యం షాపులను మహిళలు దక్కించుకోగా అత్యల్పంగా బాపట్ల జిల్లాలో ఒక మహిళకు వైన్ షాప్ లైసెన్స్ దక్కింది. అనకాపల్లిలో 25 షాపులు,శ్రీకాకుళం,విజయనగరం, నెల్లూరు జిల్లాలో 24 చొప్పున షాపులు మహిళలకు దక్కాయి.మరోవైపు అన్ని రకాల ప్రీమియం బ్రాండ్లు అందుబాటులోకి రానుండడంతో మందుబాబులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మ‌ద్యం షాపుల కోసం మహిళల తరఫున బంధువులే ఎక్కువ‌గా దరఖాస్తులు చేసుకున్నారు. శ్రీకాకుళంలో ఓ వైద్యుడు భార్య పేరుతో టెండ‌ర్లు వేయ‌గా మెజారిటీ షాపులు ఆమెకే ద‌క్కిన‌ట్లు స‌మాచారం. మహిళలకు పది శాతం షాపులు కేటాయించడంతో.. కొందరు వ్యాపారులు తమ సమీప బంధువులు, కుటుంబ సభ్యులతో దరఖాస్తు చేయించారు.లైసెన్స్ దక్కించుకున్న వారు 24 గంటల్లోగా ప్రభుత్వానికి నగదు చెల్లించాల్సి ఉంటుంది.రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు మద్యం దుకాణాలు ప్రారంభించేందుకు రంగం సిద్ధ‌మైంది. లైసెన్సులు దక్కించుకున్న వారు ఇప్పటికే షాపుల ఏర్పాటుకు అన్ని రకాల ప్రయత్నాలు మొదలుపెట్టారు. రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో షాపులు పెట్టేందుకు చాలామంది నిర్ణయం తీసుకున్నారు.సారాకు వ్య‌తిరేకంగా ఉద్య‌మాలు న‌డిపిన నెల్లూరు జిల్లాలో కూడా మ‌హిళ‌లు మెజారిటీ షాపుల‌ను ద‌క్కించుకున్నారు.అప్ప‌ట్లో ఉద్య‌మానికి సార‌ధ్యం వ‌హించిన దూబ‌గుంట రోశ‌మ్మ ఆశ‌యాలు ఏమ‌య్యాయోన‌ని కొంద‌రు సెట్లైర్లు పేలుస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version