వర్క్ ఫ్రమ్‌హోమ్‌లు, ఆన్‌లైన్ క్లాసులు పెరిగిన ఈ రోజుల్లో.. ఎవరి ఇంట్లో అయినా వైఫై ఉండటం కామన్ అయిపోయింది. మంచి ప్యాకేజ్‌తో వైఫై పెట్టించుకుంటే.. అంటే ఉద్యోగానికి, ఇటూ వినోదానికి సరిపోతుందని చాలామంది వైఫై పెట్టించుకుంటున్నారు. అయితే ఎవరూ కూడా నైట్ నిద్రపోయేప్పుడు వైఫై స్విచ్ఛ్ ఆఫ్ చేసి పడుకోరు. అలా చేయడం వల్ల రూటర్ దెబ్బతింటుందని కొందరు, ఎందుకు లే రోజూ ఆపడం అని మరికొందరు అలేనే ఉంచి నిద్రపోతారు. కానీ ఈ పద్ధతి మంచిది కాదంటున్నారు నిపుణులు.. దీని వల్ల లేనిపోని సమస్యలు వచ్చే. ప్రమాదం ఉందట..! ఇంతకీ వైఫై అంటే ఏంటో మీకు తెలుసా..? ఈరోజుం మనం వైఫై అంటే ఏంటి, రాత్రి వైఫై వాడకం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో చూద్దాం.!
వై ఫై ఎప్పుడు..? ఎక్కడ..?
మనం వాడుతున్న వైఫై ఫుల్ ఫాం చాలా మందికి తెలియదు. వైర్‌లెస్ ఫిడెలిటీ(Wireless Fidelity). దీనిని మొదటిసారి 1971లో ప్రయోగాత్మకంగా అమెరికన్లు ప్రారంభించారు. అమెరికాకు చెందిన అలోహనెట్ అనే కంపెనీ యూహెచ్ఎఫ్ వైర్‌లెస్ పాకెట్ ద్వారా గ్రేట్ హవాయియన్ ద్వీపాలను కలిపేందుకు ఇది ఏర్పాటు చేసింది. ప్రపంచంలో ఇదే తొలి వైర్ లెస్ కనెక్షన్ అని చెప్పవచ్చు. కానీ టెక్నికల్‌గా ఈ పదాన్ని మాత్రం వైఫై 1991లో నెదర్లాండ్స్‌లో ఉపయోగించారు.
నైట్ వైఫై ఆపకపోతే ఏం జరుగుతుంది..
నైట్ వైఫై ఆపకపోతే.. అదే డిమ్ లైట్‌లో మొబైల్, ల్యాప్‌టాప్‌లను నిరంతరంగా నడపడం వల్ల కంటి చూపుపై ప్రభావం పడుతోంది. దీని కారణంగా కళ్లలో మంట, కొన్నిసార్లు వాపు సమస్య ఉంటుంది.
Wi-Fi వేవ్స్, ఇంటర్నెట్ అధిక వినియోగం కూడా నిద్రను ప్రభావితం చేస్తుంది. దీంతో చాలా మందిలో నిద్రలేమి సమస్య ఎదుర్కొంటున్నట్లు వైద్యులు అంటున్నారు.
వైప్ వేవ్స్ వల్ల చిరాకు పెరుగుతుంది. మానసికంగా ప్రభావితం చేస్తాయి.
ఇంటర్నెట్‌ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల ప్రజల జ్ఞాపకశక్తిపై చెడు ప్రభావం పడుతోంది. దీనివల్ల అల్జీమర్స్ సమస్య వచ్చే అవకాశం ఉందట.. అంటే మతిమరుపు ఎక్కువవుతుందనమాట.
ఇంటర్నెట్‌ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల ప్రజలు శారీరక శ్రమను తగ్గించుకోవడం ప్రారంభించారు. దీని వల్ల ఊబకాయం సమస్య కూడా కనిపిస్తోంది.