వేసవికాలంలో రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి. చాలామంది లూజ్ మోషన్స్ తో బాధపడుతూ ఉంటారు ఈ సమస్య కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా వీటిని ట్రై చేయండి సమస్య నుండి బయట పడడానికి అవుతుంది. వేసవి కాలంలో అనారోగ్య సమస్యలు వస్తే వాటి నుండి బయటపడటం కష్టం పైగా ఒకపక్క ఆకలి వెయ్యదు. మరోపక్క తిండి తినాలని అనిపించదు. లూజ్ మోషన్స్ తో బాధపడే వాళ్ళు హైడ్రాయిడ్ గా ఉండడం మంచిదే లేకపోతే నీరసం వచ్చేస్తుంది. నీళ్లు తీసుకోవడం హెర్బల్ టీ వంటిది తీసుకోవడం లాంటివి చేయండి. ఫ్లూయిడ్స్ ని ఎక్కువ తీసుకుంటూ ఉంటే హైడ్రేట్ గా ఉండడానికి అవుతుంది.
ప్రోబయాటిక్స్ ని కూడా తీసుకుంటూ ఉండండి. ఇవి కూడా జీర్ణం బాగా అయ్యేటట్టు చేస్తాయి. గట్ బ్యాక్టీరియా ని కూడా బ్యాలెన్స్ గా ఉంచుతుంది. పెరుగు బట్టర్ మిల్క్ వంటివి తీసుకుంటూ ఉండండి. అల్లం టీ కూడా బాగా పనిచేస్తుంది ఇందులో యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు జీర్ణ సమస్యని తొలగించి బాగా జీర్ణం అయ్యేటట్టు చూస్తాయి. అల్లం టీ ని తయారు చేసుకుని అందులో కొంచెం తేనె వేసుకుని తీసుకుంటే ఈ సమస్య నుండి బయటపడొచ్చు.
బ్లాక్ టీ కూడా బాగా పని చేస్తుంది బ్లాక్ టీ తీసుకుంటే ఇంఫ్లమేషన్ తగ్గుతుంది బ్లాక్ టీ ని తీసుకుంటే లూజ్ మోషన్స్ సమస్య నుండి బయట పడొచ్చు. నిమ్మరసం కూడా చక్కగా పనిచేస్తుంది ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. నీళ్లలో కొంచెం లెమన్ జ్యూస్ వేసి తీసుకుంటే చక్కటి ప్రయోజనాలను పొందొచ్చు. ఇలా ఈ సమస్య నుండి బయట పడొచ్చు అలానే జీలకర్ర నీళ్లు కూడా బాగా పనిచేస్తాయి. జీర్ణవ్యవస్థని మెరుగుపరుస్తాయి లూజ్ మోషన్స్ తో బాధపడే వాళ్ళు రెస్ట్ తీసుకుంటూ ఉండండి కాసేపు రిలాక్స్ గా ఉండండి.