నువ్వు వర్జినా? నెటిజన్ ప్రశ్నకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన పునర్నవి..!

-

ఈమధ్య కాలంలో కొంతమంది నెటిజన్స్ మరీ హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారని చెప్పవచ్చు. ఇక సెలబ్రిటీల వ్యక్తిగత విషయాల్లోకి కూడా తల దురుస్తూ వారిని మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పాలి. ఇకపోతే నెటిజన్స్ మాటలకు కొంతమంది దిమ్మతిరిగే సమాధానం ఇస్తే.. మరి కొంతమంది ఏం చేయాలో తెలియక సోషల్ మీడియాకే దూరమవుతున్నారు. ఇకపోతే సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల పరిస్థితి పూర్తిగా విరుద్ధమని చెప్పాలి. హీరోయిన్లు ఎక్కువగా నెటిజన్స్ చేతికి చిక్కుతూ రకరకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఇక అలాంటి వారిలో ఊహించని స్థాయిలో తెలుగులో పాపులారిటీని పొందిన ప్రముఖ నటి పునర్నవి కూడా ఒకరు.

ఈమె చేసింది తక్కువ సినిమాలే అయినా ఈమె నటించిన అన్ని సినిమాలు కూడా సక్సెస్ సాధించడంతో ఈమెకు మంచి పేరు లభించింది.. సినిమాలలోనే కాదు పలు వెబ్ సిరీస్లలో కూడా నటించిన ఈ ముద్దుగుమ్మకు అనుకోని విధంగా సక్సెస్ లభించింది. ఇక పోతే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే పునర్నవి నెటిజన్స్ అడిగే ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు చెబుతూ ఉంటుంది. ఇకపోతే బిగ్ బాస్ మూడో సీజన్ లో పాల్గొన్న పునర్నవి ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజితో లవ్ ట్రాక్ నడపడంతో మరింత వైరల్ అయింది.

ఇక కమిట్మెంటల్ వెబ్ సిరీస్ ప్రమోషన్ల భాగంగా తనకు ఎంగేజ్మెంట్ అయినట్టు వెల్లడించిన ఈమె ఆ తర్వాత వెబ్ సిరీస్ కోసం ప్రమోషన్స్ చేపట్టినట్టు తెలిసి కొంత మంది నెటిజన్స్ ఈమెను పూర్తిగా ట్రోల్ చేశారు.. ఇటీవల నెటిజెన్ లతో ముచ్చటించన పునర్నవిని ఒక నెటిజన్ నువ్వు వర్జిన్వేనా అని ప్రశ్నించారు.. ఇక మరొక నెటిజన్ నువ్వు ఎవరితోనైనా డేటింగ్ చేస్తున్నావా అని ప్రశ్నించడం గమనార్హం. ఇకపోతే ఆమె నేను ఇలాంటి ప్రశ్న కోసమే ఎదురు చూస్తున్నాను అంటూ మొదటి ప్రశ్నకు అవును అంటూ.. రెండో ప్రశ్నకు కూడా సమాధానం ఇచ్చింది. ఇక పునర్నవి సమాధానానికి నెటిజనులకు బుద్ధి వచ్చిందని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version