ప్రపంచంలో మంచి ఆటతీరు కనబరచగల ఫుట్ బాల్ ఆటగాళ్లలో మెస్సి ఒకరు అని చెప్పాలి. ఇతనికి ఉన్న అభిమానుల సంఖ్యను లెక్కించలేము… ప్రపంచంలో ఎక్కడ ఫుట్ బాల్ మ్యాచ్ లో మెస్సీ ఆడినా ఎంత ఖర్చు అయినా సరే అభిమానులు చూడడానికి వెళుతునారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక తాజాగా దీనికి మరో రుజువు ఇప్పుడు కనబడుతోంది. మేజర్ లీగ్ సాకర్ లో భాగంగా ఇంటర్ మియామీ జట్టు తరపున మెస్సీ బరిలోకి దిగుతున్నాడు. మియామీ జట్టు క్రజ్ తో రేపు మ్యాచ్ ను ఆడనుంది. కాగా ఈ మ్యాచ్ కోసం USA ఫుట్ బాల్ సంఘం ఒక ధరను రూ. 39 , 900 గా నిర్ణయించింది. కానీ మ్యాచ్ లో మెస్సీ ఆడుతుండడంతో ఈ టికెట్ ధరను యాజమాన్యం ఒక్కసారిగా రూ. 90 లక్షలకు పెంచేసి అభిమానులకు బిగ్ షాక్ ఇచ్చింది.
ఫుట్ బాల్ ప్లేయర్ “మెస్సీ” మ్యాచ్ కోసం ఒక్కో టికెట్ రూ. 90 లక్షలు … !
-