అర్జున్ రెడ్డిలో న‌ర్సు పాత్ర‌కోసం అది చేయాల‌న్న ద‌ర్శ‌కుడు..!

-

టాలీవుడ్ లో కొన్ని సినిమాలు ట్రెండ్ సెట్ట‌ర్ గా నిలిచాయి. అలాంటి సినిమాల్లో నాగార్జున హీరోగా న‌టించిన శివ సినిమా ఒక‌టి కాగా నాలుగేళ్ల క్రితం ఇదే రోజున విడుద‌లైన అర్జున్ రెడ్డి సినిమా కూడా ఒక‌టి. విజ‌య్ దేవ‌రకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెర‌కెక్కించిన ఈ సినిమాకు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందాయి. యూత్ ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్న ఈ సినిమాకు ఇప్ప‌టికీ ఎంతో క్రేజ్ ఉంది. ఈ సినిమా విజ‌యంలో ద‌ర్శ‌కుడు కీల‌క పాత్ర పోశించాడనే చెప్పాలి.

arjun reddy

టాలీవుడ్ లో ల‌వ్ స్టోరీ నేప‌థ్యంలో ఇప్ప‌టి వ‌ర‌కూ ఎన్నో సినిమాలు వ‌చ్చినా అర్జున్ రెడ్డిని మాత్రం ద‌ర్శ‌కుడు కొత్త‌గా చూపించాడు. అంతే కాకుండా ఈ సినిమాను మూడు గంట‌లూ ఎక్క‌డా బోర్ కొట్ట‌కుండా సందీప్ రెడ్డి తెర‌కెక్కించాడు. ఈ సినిమా కోసం తను ఎంతగానో క‌ష్ట‌ప‌డ్డానని కూడా సందీప్ రెడ్డి అనేక సంద‌ర్బాల‌లో చెప్పారు. ఇక ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలో న‌ర్సు పాత్ర‌లో న‌టించే న‌టికి గోర్ల‌ను సైతం క‌త్తిరించుకోవాల‌ని..న‌ర్సుల‌కు గోర్లు ఉండ‌కూడద‌ని సందీప్ రెడ్డి వంగా చెప్పార‌ట‌. అంటే సందీప్ ఈ సినిమాను ఎంత సీరియ‌స్ గా తీసుకున్నారో అర్థం చేసుకోవ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version