కేంద్ర ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. దేశం తరఫున వివిధ క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు రాజీవ్ ఖేల్ రత్న పురస్కారాలతో పాటు అర్జున అవార్డు లను కూడా కేంద్ర క్రీడా మంత్రిత్వ
శాఖ ప్రకటించింది. ఇందులో భాగంగా ఇద్దరు తేజాలు ఎంపిక అయ్యారు. వారిలో అథ్లెటిక్స్ విభాగం లో యర్రాజి జ్యోతి , పారా అథ్లెటిక్స్ నుంచి తెలంగాణకు చెందిన జివాంజి దీప్తి లు అర్జున అవార్డుకు ఎన్నికయ్యారు.
కాగా జివాంజి దీప్తి పాఠాలంపిక్స్లోలో మహిళల 400 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం సాధించింది. ఇదిలా ఉంటే ఇద్దరు తెలుగు తేజాలకు కేంద్ర అర్జున అవార్డులు ప్రకటించడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.