అన్యాయంగా ఓ మహిళ ప్రాణంపోవడానికి, ఆమె కొడుకు చావు బతుకుల్లో కొట్టుమిట్టాడానికి కారణమైన హీరో అల్లుఅర్జున్ను అరెస్టు చేయాలని పీడీఎస్‌యూ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. పుష్ప-2 సినిమా పేరిట రూ.3వేల ధరకు టికెట్లను అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు.
అల్లు అర్జున్ థియేటర్‌కు రావడం వల్లే తొక్కిసలాట జరిగిందని, ఆయన బాధ్యతాయుతంగా నడుచుకోలేదని అందుకే ఆయన మీద చర్యలు తీసుకోవాలని పీడీఎస్ యూ స్టేట్ ప్రెసిడెంట్ మహేశ్ డిమాండ్ చేశారు. ప్రజాసమస్యల మీద తాము పోరాటాలు చేస్తే పెద్దఎత్తున పోలీసులను మోహరించి అడ్డుకుంటారని.. అలాంటప్పుడు మహిళ ప్రాణాలు కాపాడేందుకు ఎందుకు భద్రతను ఏర్పాటు చేయలేకపోయారని నిలదీశారు. ఈ ఘటనలో జీరో(హీరో కాదు) అల్లుఅర్జున్‌పై చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పుష్ప-2ను అడ్డుకుంటామని పీడీఎస్‌యూ డిమాండ్ చేసింది.
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయాలని విద్యార్థి సంఘం PDSC డిమాండ్
మహిళ ప్రాణాన్ని బలిగొన్న అల్లు అర్జున్ను అరెస్ట్ చేయాలి.. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పుష్ప 2 సినిమాను అడ్డుకుంటాం – PDSC https://t.co/mbTqTBvQ8A pic.twitter.com/PYSnvr3Yjb
— Telugu Scribe (@TeluguScribe) December 5, 2024