రైలు వస్తుండగా పట్టాల మధ్యలో బైకు రైడ్ చేస్తూ వ్యక్తి హల్చల్.. ఏమైందంటే?

-

నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రంలో ఓ వ్యక్తి ట్రైయిన్ వస్తుండగా దానికి ఎదురుగా పట్టాల మధ్యలో నుంచి ద్విచక్రవాహనంపై వెళ్తూ హల్చల్ చేశాడు. అది గమనించిన లోకో పైలట్లు తిరుపతి వీక్లి ఎక్స్‌ప్రెస్ రైలును ఆపేశారు. రైలు ఆగిన విషయం గమినించిన కొందరు స్థానికులు అక్కడకు చేరుకుని ఆ వ్యక్తిని పట్టాలపై నుండి పక్కకు లాగి రైల్వే పోలీసులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది.

అనంతరం పోలీసులు అక్కడకు చేరుకుని జగదీష్‌ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ చేపట్టగా తన భార్యతో సఖ్యత లేకపోవడం వల్ల ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసులకు వివరించాడు. దీంతో అతనిపై కేసు నమోదు చేసినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news