మంత్రి కొండా సురేఖ మరోసారి కేటీఆర్ ను ఉద్దేశించి.. వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఫామ్‌హౌస్‌లో పడుకుని కేటీఆర్ పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నాడని ఆగ్రహించారు కొండా సురేఖ. బీఆర్‌ఎస్‌ను తెలంగాణ ప్రజలు వద్దు అనుకున్నారు కాబట్టే కాంగ్రెస్‌ను గెలిపించారని తెలిపారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఎంతో మార్పు జరిగిందని వెల్లడించారు మంత్రి కొండా సురేఖ.
కేటీఆర్ మాట్లాడే భాష వాళ్ల నాయన కూడా ఎప్పుడూ మాట్లాడలేదని ఫైర్ అయ్యారు. తెలంగాణ వస్తుంది అని తెలిశాకే అమెరికా నుంచి నువ్వు, నీ చెల్లి తట్టబుట్ట సర్దుకుని వచ్చారన్నారు. తెలంగాణ ఉద్యమం క్రెడిట్ కోసమే నీ చెల్లి, నువ్వు రాష్ట్రానికి వచ్చారని వివరించారు. ప్రభుత్వాన్ని పడగొడతా అన్నావంటే నీ విజ్ఞత ఏంటో అర్థం అవుతుందని మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు. తెలంగాణ తల్లిని… కేటీఆర్ దొరసాని లెక్క చేశారు… కవిత లెక్క వడ్డాణం.. దొరసాని లాగ పెట్టుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మేము తెలంగాణ నిండుతనం ఉండేలా చూస్తున్నామని ప్రకటించారు.