ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితకి నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబుపై అక్రమ కేసు బనాయించినట్లు లేఖలో పేర్కొన్నారు. దుర్మార్గంగా 53 రోజులు పాటు జైలులో పెట్టారని, దీనిపై పూర్తిస్థాయి విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు.
ఇది వ్యక్తిపై జరిగిన దాడి కాదు.. వ్యవస్థలపై జరిగిన దాడిగా కోటంరెడ్డి బహిరంగ లేఖలో పేర్కొన్నారు.
రెండ్రోజుల కింద విశ్రాంత సీనియర్ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ మీడియా ముందుకు వచ్చి.. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడుని అరెస్టు చేసినప్పుడు తన వాంగ్మూలం ఆధారంగా బాబు గారి మీద కేసులు పెట్టామని వైసీపీ ప్రభుత్వంలోని సీనియర్ అధికారులు, అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పదేపదే చెప్పారని.. దీనిని తాను ఆనాడే ఖండించానిని.. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆనాడు మహాకుట్రే జరిగిందని పీపీ రమేశ్ చెప్పారని లేఖలో పొందుపరిచారు. ఈ మేరకు దీనిపై విచారణ జరపాలని హోంమంత్రికి విజ్ఞప్తి చేశారు.