అరుణాచలంలో కార్తీక దీపోత్సవం నవంబర్ 29 !

-

అరుణాచలం… సాక్షాత్తు శివస్వరూపమైన గిరి. అగ్ని లింగంగా శివుడు దర్శనమిచ్చే పవిత్రమైన క్షేత్రం ఇది. ఇక్కడ ప్రతీ ఏటా కార్తీకదీపోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని 14 రోజుల పాటు నిర్వహించి చివరిరోజు అంటే నవంబర్‌ 29న కార్తీకదీపాన్ని వెలిగిస్తారు. ఈ విశేషాలు తెలుసుకుందాం…


శివుడు మహాజ్యోతి రూపంలో సాక్షాత్కరించిన రోజు కొండమీద దీపం వెలిగిస్తారు. అత్యంత వైభవోపేతంగా జరిగే ఈ ఉత్సవం 3 వేల సంవత్సరాలకన్నా ముందునుంచే జరుగుతోందని తమిళ సాహిత్యం ఆధారంగా తెలుస్తోంది . ఈ ఉత్సవం తమిళుల కార్తీక మాసంలో (నవంబరు 15 – డిసెంబరు 15 మధ్య వస్తుంది) 10 రోజులపాటు చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. కార్తీక మాసంలో ఉత్తరాషాఢ నక్షత్రం రోజున ప్రారంభమై, భరణి నక్షత్రం రోజున ముగుస్తుంది. పదవ రోజు తెల్లవారుజామున గర్బగుడిలో భరణి దీపం వెలిగిస్తారు. అదే రోజు సాయంకాలం 6 గంటలకు అరుణాచలంపై మహాదీపం వెలిగించబడుతుంది. (తమిళ టి.వి. ఛానల్స్ లో ఈ ఉత్సవం ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.)

ఈ దీపం కోసం పది అడుగుల ఎత్తు, అయిదు అడుగుల చుట్టు కొలతగల పెద్ద లోహ పాత్రలో వేయి కిలోల స్వఛ్ఛమైన నేతిని పోసి, 350 మీటర్ల పొడవైన ప్రత్యేక వస్త్రంతో తయారు చేయబడిన వత్తి వేసి వెలిగిస్తారు. ఈ జ్యోతి ఏడు అడుగుల ఎత్తు ఎగసి, ఆ ఉజ్వల కాంతి చుట్టుప్రక్కల 35 కి.మీ.ల వరకూ కనబడుతుంది.

– శ్రీ

Read more RELATED
Recommended to you

Exit mobile version