హిందుత్వ విజయమా.. భారతావని విజయమా..? :అసదుద్దీన్​ ఓవైసీ

-

ప్రధాని నరేంద్ర మోదీపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్​ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రామమందిర భూమి పూజలో ప్రధాని పాల్గొనడాన్ని ఓవైసీ తీవ్రంగా ఖండించారు. ‘నేటి భూమిపూజ హిందుత్వ విజయమా, భారతావని విజయమా? అని ప్రశ్నించారు. పూజా కార్యక్రమం అనంతరం మాట్లాడిన ప్రధాని భావోద్వేగానికి గురయ్యారని, తాను కూడా అదే సమయంలో భావోద్వేగానికి లోనయ్యానని తెలిపారు. 450 ఏళ్లగా మసీదు ఉన్న ప్రాంతంలో, ముస్లింలు పవిత్ర స్థలంగా భావించే ప్రాంతంలో ఆర్​ఎస్​ఎస్​, భజరంగదళ్​, వీఎస్​ఎప్సీ నేతలంతా కలిసి ఆ ప్రాంతాన్ని ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీం తీర్పుకు కొన్ని రోజుల ముందే ప్రధాని ఇచ్చిన సంకేతాలు దేనికి నిదర్శనమన్నారు.

లౌకికతత్వాన్ని కాపాడతానని రాజ్యంగ సాక్షిగా ప్రమాణం చేసిన ప్రధాని నేడు అదే రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కారని మండిపడ్డారు. అన్ని మతాల వారు పోరాడితేనే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. ఒక్క హిందువులు మాత్రమే స్వాతంత్రం కోసం పోరాడలేదన్నారు. నేడు జరిగిన భూమిపూజ స్వతంత్ర భారతావని విజయం కాదన్నారు. కాంగ్రెస్​ కూడా ఈ వేడుకకు మద్దతు తెలపడం పట్ల ఆయన మండిపడ్డారు. ముస్లింలకు న్యాయం జరిగిందని మీరెలా అనుకుంటున్నారని ప్రధానపార్టీలను ఆయన నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news