మాంచెస్టర్ వేదికగా ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్ జట్ల మధ్యన యాషెస్ నాలుగవ టెస్ట్ జరుగుతోంది. ఈ సిరీస్ లో ఆస్ట్రేలియా 2 – 1 తో ముందంజలో ఉంది. ఈ మ్యాచ్ లో కనుక ఆస్ట్రేలియా విజయాన్ని సాధిస్తే మరో మ్యాచ్ తో సంబంధం లేకుండా యాషెస్ ను గెలుచుకుంటుంది. కానీ ఇంగ్లాండ్ అంత తెలీగా కంగారూలను తలొగ్గుతుందా అనుమానమే. ఇక ఈ టెస్ట్ లో మొదట టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది, బదులుగా బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ లో 317 పరుగుల వద్ద ఆల్ అవుట్ అయింది. ఈ ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా తరపున మిచెల్ మార్ష్ (51) ఒక్కడే అర్ద సెంచరీ చేశాడు. కాగా ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ అద్భుతంగా రాణించి అయిదు వికెట్లతో ఆస్ట్రేలియాను నడ్డి విరిచాడు.
యాషెస్ టెస్ట్: 317 పరుగులకు ఆస్ట్రేలియా ఆల్ ఔట్ … 5 వికెట్లతో రాణించిన వోక్స్ !
-