విజయనగరం: మాన్సాన్ ట్రస్ట్ ఛైర్మన్‌గా అశోక్ గజపతిరాజుకు చేదు అనుభవం ఎదురైంది. మాన్సాన్ ట్రస్ట్ ఛైర్మన్‌గా అశోక్ గజపతిరాజును కొనసాగించాలని హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. గురువారం పది గంటలకు ఆయన మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్‌గా ప్రమాణాస్వీకారం చేశారు. అయితే ఈ కార్యక్రమానికి అధికారులెవరూ హాజరుకాలేదు. దీంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఉద్యోగుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులకు భయపడి ఉద్యోగులు హాజరుకాకపోవడం దారుణమన్నారు.
కాగా మాన్సాస్‌లో ఆడిట్ జరగకపోవడాన్ని ఆయన గుర్తించారు. ఆశ్చర్యానికి గురయ్యారు. ఆడిట్ జరిపించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులదేనని అశోక్ గజపతిరాజు . ప్రతి ఏడాది ఆడిట్ జరపటానికి సంస్ధ నుంచి ఫీజు కూడా అధికారికంగా చెల్లించామని గుర్తు చేశారు. దోపిడిదారులకు మాన్సాస్‌లో స్థానం లేదని హెచ్చరించారు. రామతీర్థం విగ్రహం పున ప్రతిష్ట కార్యక్రమానికి తనను ఆహ్వానించలేదని చెప్పారు. మాన్సాస్ చైర్మెన్‌గా తమ ప్రథమ ప్రాధాన్యం విద్యకేనన్నారు. దాని కోసం ప్రభుత్వం సహకరించాలని అశోక్ గజపతి రాజు సూచించారు.