నటి అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ చిన్నది జూనియర్ సమంతగా తనకంటూ మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకుంది. తనదైన నటన, అందంతో జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న ఈ చిన్నది ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ షోకి వెళ్లి మరింత పాపులారిటీ పెంచుకుంది. ఆ షోలో తనదైన ఆట తీరు అందచందాలతో ప్రేక్షకుల మనసులను కట్టిపడేసింది. ఆ షో తర్వాత ఈ బ్యూటీకి వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. సినిమాలలో మాత్రమే కాకుండా యాంకర్ గా కూడా అనేక సినిమాలలో నటించి సక్సెస్ సాధించింది.

ఈ బ్యూటీకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన పిచ్చి. ఈ క్రమంలోనే ఈ చిన్నది పవన్ కళ్యాణ్ పేరుని తన ఒంటిపై టాటూ వేయించుకుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆ టాటూ కనిపించే విధంగా ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఆ ఫోటోలలో తన ప్రైవేట్ పార్ట్ పై టాటూ చాలా క్లియర్ గా కనిపిస్తోంది. దీంతో ఈ ఫోటో చూసిన నెటిజన్లు కొంతమంది ఫైర్ అవుతున్నారు. ఇంత దిగజారిపోయి ప్రైవేట్ పార్ట్ పై టాటూ వేసుకోవడం అవసరమా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కామెంట్ల పైన అషు రెడ్డి ఇలా రియాక్ట్ అవుతుందో చూడాలి.