బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ కవిత సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు ప్రకటన వచ్చింది. హరీష్ రావు, సంతోష్ పై కవిత చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న కేసీఆర్… బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేసారు.

పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు నిన్నటి నుంచి వార్తలు రాగా….కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేసినట్లు లేఖ కూడా రిలీజ్ చేసాడు.
ఇక అటు సొంత రాజకీయ భవిష్యత్తు కోసం బీజేపీకి అమ్ముడుపోయి హరీష్ రావు, సంతోష్ రావు లపై నిరాధారమైన ఆరోపణలు చేస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చిత్రపటాన్ని దగ్ధం చేసారు మెదక్ బీఆర్ఎస్ నేతలు.