T-20 World Cup Final : గెల‌వ‌బోయే టీం పేరు చెప్పిన అశ్విన్

-

దుబాయ్ వేదిక‌గా ఈ రోజు టీ ట్వంటి ప్రపంచ క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ ఫైన‌ల్ మ్యాచ్ లో ట్రోఫీ కోసం న్యూజిలాండ్ తో ఆస్ట్రేలియా త‌లప‌డుతుంది. అయితే ఈ మ్యాచ్ గురించి క్రికెట్ అభిమానులు, సెలబ్రెట్స్, మాజీ ఆట‌గాళ్లు తో పాటు వివిధ దేశాల ఆట‌గాళ్లు కూడా స్పందిస్తున్నారు. త‌మ ఫేవ‌రేట్ జ‌ట్టు ను చెబుతున్నారు. అలాగే ఈ ఫైన‌ల్ లో ఎవ‌రు గెలుస్తారో కూడా అంచ‌నా వెస్తున్నారు. తాజాగా టీమిండియా స్టార్ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ కూడా ఈ ఫైన‌ల్ మ్యాచ్ పై స్పందించాడు. ఈ సంద‌ర్భంగా త‌న ఫేవ‌ర‌ట్ జ‌ట్టు కూడా ప్ర‌క‌టించాడు.

ఆస్ట్రేలియా జ‌ట్టు ఫైన‌ల్ మ్యాచ్ లో విజ‌యం సాధించి ట్రోఫీ ని సొంతం చేసుకుంటుంద‌ని అంచనా వేశాడు. ఇప్ప‌టి వ‌ర‌కు పెద్ద ట్రోఫీ ల‌లో ఆస్ట్రేలియా కు ఆడిన అనుభవం ఈ ఫైన‌ల్ మ్యాచ్ కు కలిసి వ‌స్తుంద‌ని అన్నారు. అలాగే న్యూజిలాండ్ ఎలా ఆడ‌గల‌దో ఆస్ట్రేలియా అంచనా వేయ క‌లిగే స్థాయి ఉందని అన్నారు. ఎలా చూసినా.. న్యూజిలాండ్ పై ఆస్ట్రేలియా పూర్తి ఆధిప‌త్యం చెలాయించే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేశారు. అయితే ఈ టోర్న‌మెంట్ లో మొద‌ట టాస్ నెగ్గిన వారే విజ‌యం సాధిస్తున్నారు. అయితే ఈ ఫైన‌ల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version