హుజురాబాద్ ఉప ఎన్నిక లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలు కావడం తో ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు సీరియస్ అయ్యారు. దీంతో శని వారం కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర కాంగ్రెస్ నేతలను ఢిల్లీ కి పిలుచుకుంది. అంతే కాకుండా వార్ రూమ్ లో హుజురాబాద్ ఉప ఎన్నికల ఓటమి పై సమీక్షా సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమిక్షా సమావేశం లో గందరగోళం జరిగిందని.. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఒకరి పై ఒకరు నింధలు వేసుకున్నారని వార్తలు వచ్చాయి.
అయితే ఈ వార్తలపై సీఎల్పీ నేత భట్టి విక్కమార్క స్పందించాడు. హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితం పై జరిగిన సమీక్షా సమావేశం బాగానే సాగిందని అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో ఎలాంటి గందరగోళం జరగలేదని వివరించారు. ఈ సమీక్షా సమావేశం పై వస్తున్న వార్తలు అన్నీ కూడా అబద్ధాలు అని భట్టి అన్నారు. కొంత మంది కావాలనే కాంగ్రెస్ పార్టీ పరువు తీయాలని ఇలాంటి వార్తలు సృష్టిస్తున్నారని మండి పడ్డారు. అయితే ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల మధ్య గొడవలు అయ్యాయని శనివారం వార్తలు వచ్చాయి.