ఆసియా కప్ మ్యాచ్ లను “ఫ్రీ” గా చూసే అవకాశం !

-

క్రికెట్ ప్రేమికులకు రేపటి నుండి శ్రీలంక మరియు పాకిస్తాన్ వేదికలుగా జరిగే ఆసియా కప్ ద్వారా అసలైన మజాను పొందే అవకాశం ఉంది. ఈ టోర్నమెంట్ లో మొత్తం ఆరు జట్లు పోటీ పడుతుండగా ఫేవరెట్ లుగా ఇండియా, పాకిస్తాన్ మరియు శ్రీలంకల బరిలోకి దిగనున్నాయి. రేపు మొదటి మ్యాచ్ లో పాకిస్తాన్ మరియు నేపాల్ లు సమరానికి ఆరంభాన్ని ఇవ్వనున్నాయి. ఇక ఆసియా కప్ మ్యాచ్ లు అన్నీ కూడా స్టార్ స్పోర్ట్స్ ఛానెల్ లోనే ప్రసారం కానున్నాయి. ఇక డిజిటల్ ప్రసారం డిస్నీ + హాట్ స్టార్ లో రానుంది. అయితే ఈ మ్యాచ్ లను వీక్షించడానికి అభిమానులు ఎటువంటి రుసుమును చెల్లించకుండా ఉచితంగా చూడొచ్చట. డిస్నీ + హాట్ స్టార్ లో ఉచితంగా చూసే వెసులుబాటును కల్పించింది.

మరి వరల్డ్ కప్ కు ముందుగా జరగనున్న ఈ ఆసియా కప్ లో బాగా ఆడితే వారికి అనుకూలంగా పరిస్థితులు మారే ఛాన్సెస్ ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version