టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్‌కు ఊహించని పరిణామం చోటు చేసుకుందట. కాజల్ అగర్వాల్‌కు యాక్సిడెంట్ అంటూ వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పరిస్థితి విషమంగా ఉందంటూ ప్రచారం చేశాయి పలు యూట్యూబ్ ఛానెల్స్. తాజాగా ఈ వార్తలపై స్పందించిన కాజల్… ప్రమాదంపై క్లారిటీ ఇచ్చింది.

తనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని, తాను క్షేమంగానే ఉన్నట్లు స్పష్టం చేసిన కాజల్..ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. తనకు ఏం కాలేదని తెలిపింది. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని వివరించింది.
కాగా ఈ చిన్నది అనేక సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. అతి తక్కువ సమయంలోనే తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా తన సత్తాను చాటుకుంది. తెలుగులోనే కాకుండా హిందీలోనూ అనేక సినిమాలలో నటించి అభిమానుల మనసులను దోచుకున్న ఈ చిన్నది ఇటీవలే తన కుటుంబ సభ్యులతో కలిసి మాల్దీవ్ వెకేషన్ కి వెళ్ళింది.