కేసీఆర్‌ జాతీయపార్టీపై అస్సాం సీఎం సంచలన వ్యాఖ్యలు

-

కేసీఆర్‌ జాతీయపార్టీపై అస్సాం సీఎం హేమంత్ బిశ్వాస్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుటుంబ పార్టీలు వారి కోసమే ఆలోచిస్తాయి.. కెసిఆర్ కొత్త పార్టీ పెట్టుకోవచ్చన్నారు. దేశంలో ప్రతిపక్షాలన్నీ కలిసే ఉన్నాయని.. కొత్తగా కెసిఆర్ వారిని ఏకం చేయాల్సిన అవసరం లేదని విమర్శలు చేశారు.

కెసిఆర్ చంద్రుని మీదనో, సూర్యుని మీదనో సముద్రం లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కుంటే చేసుకొని.. కెసిఆర్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాడు అందుకే జాతీయ పార్టీ అని అంటున్నాడని ఎద్దేవా చేశారు.

కెసిఆర్ ఇచీన హామీలు నెరవేర్చు… లేకుంటే దేశం లో ఎక్కడ తిరిగిన గౌరవం లభించదని.. తెలంగాణలో బిజెపి కచ్చితంగా అధికారంలోకి వస్తోందని ధీమా వ్యక్తం చేశారు. నయా నిజాం పరిపాలన తెలంగాణలో అంతం చేస్తామని.. 2024 లో అధికారం లోకి వచ్చేది మోడీ నేనన్నారు. దేశ ప్రధాని గా మోడీ ఉన్నాడు ఉంటాడు.. ఇంకో ముపై ఏళ్ల వరకు బిజెపి అధికారంలో ఉంటుందని పేర్కొన్నారు అస్సాం సీఎం హేమంత్ బిశ్వాస్ శర్మ.

Read more RELATED
Recommended to you

Exit mobile version