రష్యా అధ్యక్షుడు పుతిన్ పై హత్యాయత్నం?

-

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై హత్యాయత్నం జరిగినట్లు తెలుస్తోంది. రష్యా అధ్యక్షుడి ఖరీదైన కారు అగ్నిప్రమాదానికి గురైంది. ఆ కారు అత్యంత భద్రతో కూడుకున్నది. అయితే, మాస్కోలోని లుబ్యంకాలో ఉన్న జాతీయ భద్రతా సర్వీస్ ప్రధాన కార్యాలయం వద్ద ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో అధ్యక్షుడి కారుకు మంటలు అంటుకున్నట్లు సమాచారం.

దీంతో పుతిన్ వినియోగించే అరస్ లిమోజీన్ కారు మంటల్లో చిక్కుకున్నది. పుతిన్ టార్గెట్‌గా బాంబ్ బ్లాస్ట్ జరిగినట్లు కథనాలు వస్తున్నాయి.దీంతో రష్యా అధ్యక్షుడి భద్రతపై కలిగిస్తున్న పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇదిలాఉండగా, రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇంకా తుదిదశకు చేరుకోలేదు. ప్రస్తుతం శాంతి ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి. కాగా, పుతిన్ త్వరలోనే చనిపోతాడని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రకటించిన కొద్దిరోజులకే ఇలా జరగడం పలు అనుమానాలు రేకెత్తిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news