హైదరాబాద్ వాహనదారులకు బిగ్ షాక్ తగిలింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ ఛార్జీలను పెంచారు. రేపటి నుంచి అమలులోకి రానున్నాయి పెరిగిన ఓఆర్‌ఆర్ టోల్ ఛార్జీలు. ఓఆర్‌ఆర్‌పై టోల్ వసూళు చేస్తోంది ఐఆర్‌బీ ఇన్ ఫ్రా సంస్థ. కారు, జీపు, వ్యాన్, లైట్ వెహికిల్స్‌కు కిలో మీటర్‌కు 10 పైసలు పెంచింది.

కారు, జీపు, లైట్ వెహికిల్‌కు కి.మీ. రూ .2.34 నుంచి రూ.2.44కు పెంచారు.. మినీ బస్సు, ఎల్‌సీవీ వాహనాలకు కిలో మీటర్‌కు 20 పైసలు పెంచారు. మినీ బస్సు, ఎల్‌సీవీ వాహనాలకు కి.మీ. రూ.3.77 నుంచి రూ.3.94కు పెంచారు. బస్సు, 2 యాక్సిల్ బస్సులకు కి.మీ.రూ.6.69 నుంచి రూ. 7కు పెంచింది ఐఆర్‌బీ ఇన్ ఫ్రా సంస్థ. భారీ సైజు వాహనాలకు కి.మీ. రూ. 15.09 నుంచి రూ. 15.78కు పెంచింది ఐఆర్‌బీ ఇన్ ఫ్రా సంస్థ.. భారీ వాహనాలకు కి. మీ 70 పైసలు పెంచిన ఐఆర్‌బీ ఇన్ ఫ్రా సంస్థ… ఈ మేరకు ప్రకటన చేసింది.