అసెంబ్లీ సమావేశాల పై స్పీకర్ తమ్మినేని సీతారాం, శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. వివేకా హత్య పై తప్పుడు రాతలు, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. దానిపై కూడా అసెంబ్లీ లో మేము చర్చించేందుకు సిద్ధం మేము టిడిపి కి సవాల్ విసిరారు. అసెంబ్లీ లో ప్రజాసమస్యలను అత్యంత ప్రధాన్యంగా సమావేశాలు నిర్వహిస్తామని.. ప్రజా సమస్యలపై ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందన్నారు.
గతంలో టీడీపీ లా కాకుండా మేము ప్రతిపక్షాన్ని గౌరవిస్తున్నామని.. చంద్రబాబు కుటుంబ సభ్యుల పెరు తెచ్చి సమావేశాల నుండి వెళ్లిపోయారని ఫైర్ అయ్యారు. టీడీపీ కి చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ కి హాజరవ్వాలని.. అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండి రాజకీయం చెయ్యాలని అనుకుంటున్నారన్నారు. టీడీపీ బయట మాట్లాడేవి అసెంబ్లీ లోకి వచ్చి మాట్లాడాలని.. అసెంబ్లీ అధికారుల పై సీనియర్ ఎమ్మెల్యే ధర్మాన లేఖ రాశారని పేర్కొన్నారు. దీనిపై బి ఏ సి లో చర్చించాలని కొరతామని.. దీనిపై స్పీకర్ అనుమతితో చర్చ జరపాలని కొరతామన్నారు. అసెంబ్లీ కి ఉన్న హక్కుల పై చర్చించాలని భావిస్తున్నామని చెప్పారు.