అప్పుడు సచిన్, ఇప్పుడు జడేజా… రాహుల్ ద్రావిడే విలన్

-

శ్రీలంకతో మోహాలీలో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో టీం ఇండియా భారీ స్కోర్ చేసింది. ముక్యంగా లోయర్ ఆర్డర్లో వచ్చిన రవీంద్ర జడేజా అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 228 బాల్స్ లో 3 సిక్సులు, 17 ఫోర్లలో 175 నాటౌట్ గా నిలిచాడు. తొలి రోజు రిషబ్ పంత్ 96 పరుగులు, కోహ్లీ 45, హనుమ విహారీ 58 పరుగులు చేశారు. దీంతో టీమిండియా 574/8 స్కోర్ వద్ద తన ఇన్నింగ్స్ డిక్లెర్ చేసింది. 

అంతా బాగానే ఉంది కానీ.. రవీంద్ర జడేజా మరికొన్ని ఓవర్లు ఆడితే తన డబుల్ సెంచరీ చేసుకునే అవకాశం ఉండేది. ఈ లోపే కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్సింగ్స్ డిక్లెర్ చేశారు. ప్రస్తుతం ఈవిషయంపైనే రచ్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో గతంలో సచిన్ విషయంలో జరిగిందే.. ప్రస్తుతం జడేజా విషయంలోనూ జరిగిందంటూ.. నెటిజెట్లు కామెంట్లు పెడుతున్నారు. రెండు చోట్ల రాహుల్ ద్రావిడ్ నే విలన్ గా భావిస్తున్నారు. ‘‘కొన్ని విషయాలు ఎప్పటికీ మారవు’’, ‘‘ ఐలవ్ రాహుల్.. ద్రావిడ్ కానీ’’, ‘‘సేమ్ ఫీలింగ్’’ అంటూ రాహుల్ ద్రావిడ్కు వ్యతిరేఖంగా కామెంట్లు చేస్తున్నారు. గతంలో ఇలాగే సచిన్ 194 పరుగుల వద్ద ఉండగా.. అప్పుడు కెప్టెన్ గా ఉన్న రాహుల్ ద్రావిడ్ ఇన్నింగ్స్ డిక్లెర్ చేశాడు. 2004లో పాకిస్తాన్ తో ముల్తాన్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్ లో సచిన్ డబుల్ సెంచరీకి మరో 6 పరుగుల దూరంలో ఉండగా రాహుల్ ద్రావిడ్ ఇన్నింగ్స్ డిక్లెర్ చేశాడు.  అప్పట్లో ఈ నిర్ణయం టీమిండియాలో తీవ్ర రచ్చకు దారి తీసిందిా. తాజాగా రాహుల్ ద్రావిడ్ కోచ్ గా ఉన్న సమయంలో రవీంద్ర జడేజాకు ఇలా జరిగిందటూ.. కామెంట్స్ చేస్తున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version