తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వచ్చే లోక్ సభ ఎన్నికల వేళ కీలక అభివృద్ధి పనులపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఎన్ హెచ్-44 పై ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.గత పది సంవత్సరాలలో మహిళా సంఘాలను పట్టించుకున్నవారే లేరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈనెల 12న పరేడ్ గ్రౌండ్లో లక్ష మంది మహిళలతో భారీ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆరోజున మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ సభకు మహిళలంతా రావాలని పిలుపునిచ్చారు.
తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకం ద్వారా..ఇప్పటివరకు ఆర్టీసీ బస్సుల్లో 24 కోట్ల జీరో టికెట్లు పొంది మహిళలు ఉచితంగా ప్రయాణించారని వెల్లడించారు.500 వందలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల లోపు ఫ్రీ కరెంట్ వంటి ప్రతిష్టాత్మక పథకాలను అమలు చేశామని ముఖ్యమంత్రి రేవంత్ పేర్కొన్నారు.