కల్కి, పుష్ప-2 ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ కి భారీ ధర ?

-

మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా కల్కి చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.అలాగే సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప-2’ లో నటిస్తున్నాడు. ఇక ఈ రెండు చిత్రాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాల షూటింగ్ శరవేగంగా సాగుతుండగా ఓవర్సీస్ థియేట్రికల్ రైట్కు భారీ డిమాండ్ ఏర్పడిందని సినీ వర్గాలు తెలిపాయి. ఒక్కో సినిమాకు నిర్మాతలు రూ.100 కోట్లు కోట్ చేసినట్లు చెబుతున్నాయి. రిలీజ్కు టైమ్ ఉండటంతో ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ ఇంకా అమ్ముడుపోలేదని సమాచారం.

కాగా, కల్కి సినిమాని మే 9 న తీసుకురావడానికి వైజయంతి మూవీస్ ప్రయత్నిస్తుంది. ఇందులో హీరోయిన్ గా దీపికా పదుకొనే ,దిశ పటాని నటిస్తున్నారు. ఇక పుష్ప సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తుంది .ఈ సినిమాను స్వాతంత్ర దినోత్సవము కానుకగా ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version