ఐపీఆర్‌లో అసిస్టెంట్ ఉద్యోగాలు… ఇలా అప్లై చెయ్యండి..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. భార‌త అణుశ‌క్తి విభాగానికి చెందిన గుజ‌రాత్ గాంధీన‌గ‌ర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్‌ తాజాగా నోటిఫికేషన్ ని భర్తీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 81 పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తున్నారు.

ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే… ఆన్ లైన్ పద్దతి లో ఈ పోస్టులకి అప్లై చేసుకోవలసి వుంది. వయస్సు వివరాల లోకి వెళితే.. అభ్య‌ర్థి గ‌రిష్ట వ‌య‌సు 35 ఏళ్ల‌కు మించి ఉండ‌కూడ‌దు.

దీనిలో కనుక ఎంపికైతే నెల‌కు రూ.20,000 వేత‌నం ఇస్తారు. ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ జ‌న‌వ‌రి 17, 2022 . కనుక ఈ లోగ అప్లై చేసుకోవడం మంచిది. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలని అధికారిక వెబ్‌సైట్ https://www.ipr.res.in/documents/jobs_career.html ను ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు. రాత ప‌రీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఫైనల్ గా సెర్టిఫికెట్స్ ని చూసి నియమిస్తారు. ఇక ఎలా అప్లై చేసుకోవాలనేది చూస్తే..

ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://www.ipr.res.in/documents/jobs_career.html ను ఓపెన్ చెయ్యాలి.
నెక్స్ట్ మీరు నోటిఫికేష‌న్ పూర్తిగా చ‌ద‌వాలి.
ఇక్కడ మీరు Apply online ఆన్‌లైన్ లింక్‌పై క్లిక్‌చేయాలి
మీ యొక్క ఈమెయిల్ ఐడీ ,పేరుతో రిజిస్ట‌ర్ చేసుకోవాలి.
అప్లికేష‌న్ ఫాంను నింపాలి.
రూ.200 ప‌రీక్ష ఫీజు చెల్లించాలి.
అప్లికేష‌న్ పూర్త‌యిన త‌రువాత స‌బ్‌మిట్ చెయ్యాలి అంతే.

Read more RELATED
Recommended to you

Exit mobile version