సెంచూరియన్ టెస్ట్ లో టీమిండియా ఆలౌట్..49 పరుగులకే 7 వికెట్లు

-

సెంచూరియన్‌ వేదికగా దక్షిణా ఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌ లో టీమిండియా 327 పరుగులకు ఆల్‌ అవుట్‌ అయింది. రెండో రోజు ఆట వర్షార్ఫణం కాగా.. మూడో రోజు ఆటలో టీమిండియా తీవ్రంగా ఇబ్బందులు పడింది. తొలి సెషన్‌ ప్రారంభ మైన కాసేపటికే.. సెంచరీ చేసిన కేఎల్‌ రాహుల్‌ కేవలం 123 పరుగుల వద్ద కీపర్‌ డీకాక్‌ కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.

ఆ వెంటనే రహానే కూడా 48 పరుగుల వద్ద వెనుతిరిగాడు. ఆ తర్వాత వెంట వెంటనే.. టీమిండియా వికెట్లు కోల్పోయింది. కీపర్‌ రిషబ్‌ పంత్‌ 8 పరుగులు, రవి చంద్రన్‌ అశ్విన్‌ 4 పరుగులు, శార్దూల్‌ ఠాకూర్‌ 4 పరుగులు, షమీ 8 పరుగుల చేసి.. వెను దిరిగారు. ఇక బుమ్రా కేవలం 14 పరుగులకు చేసి.. పర్వాలేదని పిచ్చాడు. ఇది ఇలా ఉండగా.. మూడో రోజు తొలి సెషన్‌ లో టీమిండియా 49 పరుగుల చేసి ఏకంగా ఏడు వికెట్లు కోల్పోవడం గమనార్హం. దీంతో ఇండియా ఫ్యాన్స్‌ నిరాశ కు గురవుతున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version