తెలంగాణ రైతులకి శుభవార్త.. రైతు బంధు నిధులు విడుదల..!

-

తెలంగాణ సర్కారు రైతులకి గుడ్ న్యూస్ చెప్పింది. ఈ రోజు నుండి రైతుల అకౌంట్ లో ‘రైతు బంధు’ నిధులు జమ చేస్తున్నట్టు అధికారాలు తెలిపారు. సీఎం కేసీఆర్ గతంలో చెప్పినట్టే అధికారులు అనుసరిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఆర్థిక శాఖలు ప్రస్తుత యాసంగి సీజన్‌లో మొత్తం రూ.7,600 కోట్లు పంపిణీ చేయాల్సి ఉంటుందని అంచనా వేశారు.

గత ఏడాది జూన్‌ నుంచి సెప్టెంబరు వరకూ వానాకాలంలో మొత్తం కోటిన్నర ఎకరాలకు చెందిన 63.25 లక్షల కమతాలకు రూ.7,508.78 కోట్లు రైతుల ఖాతాల్లో పడ్డాయి. ఈ నెల 10 వరకూ భూముల క్రయవిక్రయాలతో రెవెన్యూ రికార్డుల్లో నమోదైన రైతుల పేర్లను ఈ నెల31లోగా నమోదు చేయాలని ఏఈవోలను ఆదేశించడం జరిగింది.

రైతులు ఆధార్‌, పట్టాదారు పాసుపుస్తకం, రెవెన్యూ ఖాతా వివరాలను తెచ్చి ఇస్తే రైతుబంధు పోర్టల్‌లో కొత్తగా భూములను కొన్న రైతులు వివరాలని ఏఈవోలు నమోదు చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే గత జూన్‌ నుంచి ఈ నెల 10 వరకూ కొత్తగా 20 వేల మంది భూములు కొన్నట్లు అంచనా. అయితే వారి వివరాలని ఎంటర్ చేస్తేనే డబ్బులు జమ అవుతాయి.

ఈ నెల 28 నుంచి ముందుగా ఎకరా భూమి ఉన్న రైతుల బ్యాంకు అకౌంట్ లో డబ్బులు పడతాయి. అలానే రెండో రోజున ఎకరా నుంచి 2, మూడో రోజున 2 నుంచి 3 ఎకరాలు…ఇలా రోజూ పెంచుతూ డబ్బుల్ని పంపుతారు. డబ్బులు పడ్డాక మెసేజ్ వస్తుంది. ఆ తరవాత డబ్బులని డ్రా చేసుకోవచ్చు.

ఈ డబ్బుల్ని ఇలా చెక్ చెయ్యండి:

డబ్బుల్ని చెక్ చేసుకోవడానికి అఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి
మెనూ బార్ మీద రైతుబంధు స్కీమ్ డీటెయిల్స్ అని ఉంటాయి. అక్కడ క్లిక్ చేసి..
సంవత్సరం, టైప్ మరియు పిబిబి నంబర్ ని టైప్ చేయండి.
ఆ తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి.

లేదా

మీరు రైతు బంధు పేమెంట్ స్టేటస్ కోసం IFMIS వెబ్ సైట్ కి వెళ్లి
సంవత్సరం, టైపు, PPB నెంబర్ ని టైప్ చేసి సబ్మిట్ చేయండి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version